|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సత్యదేవ్ మాస్ ట్రీట్! ఫరియాతో కలిసి దుమ్ము రేపేందుకు రెడీ.. SD15 మూవీతో రికార్డులు షురూ!

Published: 18-02-2026, 10:05 AM
సత్యదేవ్ మాస్ ట్రీట్! ఫరియాతో కలిసి దుమ్ము రేపేందుకు రెడీ.. SD15 మూవీతో రికార్డులు షురూ!
  • సత్యదేవ్ 15వ సినిమా SD-15గా త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రారంభం!
  • డైరెక్టర్ లక్ష్మినారాయణ పుట్టంచెట్టి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న చిత్రం!
  • హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా.. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ స్టార్ట్!
  • అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టగా.. వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్!

టాలీవుడ్ లో సరికొత్త కాంబో సెట్ అయింది! సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా కలిసి SD-15 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

సత్యదేవ్ 15వ సినిమా ప్రారంభం!

హీరో సత్యదేవ్(Satyadev) తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ఆయన 15వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. SD-15 వర్కింగ్ టైటిల్‌తో త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్‌తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి (Lakshminarayana Puttanchetty)తెరకెక్కి్స్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) నాయికగా నటిస్తోంది. తాజాగా, హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేయగా.. లక్ష్మినారాయణ ఫస్ట్ షాట్‌కు డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. నా స్నేహితుడు ప్రొడ్యూసర్ నరేంద్ర మరో మంచి చిత్రాన్ని చేస్తున్నారు. హీరో సత్యదేవ్ గారు ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు.

ఈ సినిమా ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా సాధించబోయే విజయం గురించి తర్వాత మళ్లీ మాట్లాడుతాను. డైరెక్టర్ లక్ష్మినారాయణకు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు. డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ.. మా సినిమా జానర్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. రామ్ మిరియాల అన్న మా సినిమాకు మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ గారి కెరీర్ లో ఇదొక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన అతిథులకు, మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పారు.

ఫరియాతో సత్యదేవ్ జోడీ ఫిక్స్!

అనిల్ రావిపూడి చేతుల మీదుగా క్లాప్!

సత్యదేవ్ కెరీర్ లోనే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.