
📌 Key Points
- జ్యోతిష్కుని ఆదేశాల మేరకు షర్ట్ లేకుండా ఇంట్లోకి మనోజ్ ప్రవేశం.
- బాలు ఆలోచనతో ఇంటి ఖర్చుల కోసం పొదుపు చేయాలని హుండీ ఏర్పాటు.
- రెస్టారెంట్ వారు ప్రకటించిన లక్ష రూపాయల బెస్ట్ కపుల్ పోటీ.
- సత్యం కుటుంబం రహస్యంగా బెస్ట్ కపుల్ పోటీలో పాల్గొనాలని నిర్ణయం.
గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా మారింది. జ్యోతిష్కుడు చెప్పినట్టు మనోజ్ షర్ట్ లేకుండా వింతగా ప్రవర్తించాడు. లక్ష రూపాయల ప్రైజ్ మనీతో బెస్ట్ కపుల్ పోటీలో సత్యం ఫ్యామిలీ రహస్యంగా పాల్గొంటుంది. ఈ అనూహ్య మలుపులు ప్రేక్షకులను అలరించనున్నాయి.
మనోజ్ విచిత్ర ప్రవర్తన వెనుక అసలు కారణం?
గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 22 ఎపిసోడ్‌లో జ్యోతిష్కుడు చెప్పినట్లుగా షర్ట్ లేకుండా కండువా వేసుకుని ఇంట్లోకి వెళ్తాడు మనోజ్. అది చూసి అంతా షాక్ అవుతారు. ఇల్లు కోసం డబ్బులు పొదుపు చేయాలని హుండీ తీసుకొస్తాడు బాలు. బెస్ట్ కపుల్ పోటీ పెడుతున్నట్లు రవి చెబుతాడు. అందులో సత్యం ఫ్యామిలీ పాల్గొంటుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోతిష్కుడుని మనోజ్ కలుస్తాడు. తాను చెప్పినట్లుగానే రోజు రంగుల బట్టలు వేసుకోవాలని, ఇవాళ ఈ షర్ట్ వద్దని విప్పిస్తాడు జ్యోతిష్కుడు. షర్ట్ విప్పించి కండువా ఇస్తాడు. నీ బట్టలు నీ భార్య మాత్రమే ఉతకాలి. నీకు అదృష్టం మొదలై కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని జ్యోతిష్కుడు అంటాడు.
విచిత్రంగా మాట్లాడుతూ ఎవరిని ముట్టుకోనివ్వడు మనోజ్. హుండి సంగతి చెప్పురా అని సత్యం అంటే.. రోజు ఆదాయం వేసి పొదుపు చేయాలనుకుంటున్నాం అని బాలు చెబుతాడు. బాలు డబ్బు ఇచ్చి సత్యం, ప్రభావతితో హుండిలో వేయిస్తాడు. ఇంతలో రోహిణి వస్తుంది. మనోజ్ గురించి చెబితే పైకి వెళ్లి భర్తను అడుగుతుంది. జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్లింది అంతా చెబుతాడు మనోజ్.
లక్ష రూపాయల బెస్ట్ కపుల్ పోటీ: ఎవరు గెలుస్తారు?
ఇప్పుడు నేను ఎవరిని నమ్మట్లేదు అని మనోజ్ అంటే.. నన్ను కూడా నమ్మట్లేదా అని రోహిణి అంటుంది. అది ఇప్పుడు నేను కచ్చితంగా చెప్పలేను అని నమ్మన్నట్లుగా చెబుతాడు మనోజ్. ప్రభావతిని పిలిచి రోజుకో రంగు వేసుకుంటానని ఆ షర్ట్స్ చూపిస్తాడు మనోజ్. అంతా ఆధ్యాత్మికంగా మనోజ్ మాట్లాడుతాడు. నేను నా బిజినెస్ బాగుండాలంటే కచ్చితంగా ఈ బట్టలు వేసుకోవాల్సిందే అని మనోజ్ అంటాడు.
సత్యమే వెంటపడి మాట్లాడని ప్రభావతి గొప్పగా చెప్పిందని కామాక్షి చెబితే జరిగింది చెబుతాడు బాలు. ఇంతలో రవి వచ్చి అందరిని పిలుస్తాడు. అంతా వస్తారు. తమ రెస్టారెంట్ వాళ్లు బెస్ట్ కపుల్ పోటీ పెడుతున్నట్లు, మనకోసం నాలుగు ఫామ్స్ తీసుకొచ్చాం అని రవి చెబుతాడు. వెళ్తే మనోజ్, రోహిణి వెళ్తారు. వాళ్లే ఆదర్శ దంపతులు అంటుంది ప్రభావతి.
సత్యం ఫ్యామిలీ రహస్యంగా పోటీలో పాల్గొనడం వెనుక మర్మం
ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను వెళ్తే నా స్టేటస్ ఏమైపోతుంది అని మనోజ్ అంటాడు. అయ్యో అంతా వస్తారనుకున్నానే. ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అని శ్రుతి చెబుతుంది. అమ్మో లక్ష అని మనోజ్ అంటాడు. ఎలాంటి పోటీలు పెడతారో అని బాలు అంటాడు. లక్ష అని ప్రభావతి మురిసిపోతుంది. తర్వాత రోహిణితో కాంపిటీషన్‌లో పాల్గొందాం అని మనోజ్ అంటాడు.
కట్ చేస్తే ఎవరికి తెలియకుండా సత్యం ఫ్యామిలీ అంతా ఆదర్శ దంపతుల పోటీకి వెళ్తారు. ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని మనోజ్, బాలు ఛాలెంజ్ చేసుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మనోజ్ విచిత్ర ప్రవర్తన, లక్ష రూపాయల బెస్ట్ కపుల్ పోటీలో సత్యం కుటుంబం రహస్యంగా పాల్గొనడం నేటి ఎపిసోడ్‌కు హైలైట్. ఈ అనూహ్య మలుపులతో రాబోయే ఎపిసోడ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


