
📌 Key Points
- హైదరాబాద్ – గోరఖ్‌పూర్ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ నెలలో పొడిగింపు.
- హైదరాబాద్ నుండి ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.
- గోరఖ్‌పూర్ నుండి ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
- ఈ రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, నాగ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తాయి.
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి గోరఖ్‌పూర్ వెళ్లే రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్-గోరఖ్‌పూర్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు
వేసవి వేళ ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీని క్లియర్ చేసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద – గోరఖ్ పూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం… హైదరాబాద్ – గోరఖ్‌పూర్(ట్రైన్ నెంబర్ 07075) ను ప్రత్యేక రైలు సేవలను పొడిగించారు. ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ రాత్రి 9 గంటలకు బయల్దేరుతుంది.
రైలు సమయాలు మరియు తేదీల వివరాలు
ఈ ట్రైన్… సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ మీదుగా గోరఖ్‌పూర్ కు చేరుకుంటుంది.
ఇక గోరఖ్‌పూర్ – హైదరాబాద్(ట్రైన్ నెంబర్ 07076) మధ్య నడిచే ప్రత్యేక రైలు కూడా పొడిగించారు. ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఆయా తేదీల్లో ఉదయం 0.30 గంటలకు బయల్దేరుతుంది.
ప్రయాణ మార్గం మరియు స్టేషన్ల సమాచారం
ఈ ట్రైన్… గోండా జంక్షన్, గోమతి నగర్,లక్నో సిటీ, కాన్పూర్ సెంట్రల్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, బీనా జంక్షన్ , నాగ్‌పూర్ , బల్లార్షా,మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట జంక్షన్, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా నాంపల్లికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.


