
📌 Key Points
- అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో ‘సీతా పయనం’ మూవీ విడుదల.
- కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌లను పరిచయం చేసిన అర్జున్.
- చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించి ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపింది.
- ప్రేక్షకులు తమ జీవితాన్ని చూసినట్టు ఉందని అర్జున్ సర్జా అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ మూవీ ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తన కూతురు ఐశ్వర్య అర్జున్ మరియు నిరంజన్ ను పరిచయం చేశారు. సినిమాకి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది.
‘సీతా పయనం’ మూవీ విశేషాలు
Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని తెరకు పరిచయం చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియెన్స్, మీడియా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు.
Read also- Film industry: ప్రముఖ గాయని కన్నుమూత.. ఆ భయంకరమైన వ్యాధితో పోరాడుతూ!
థాంక్యూ మీట్‌లో అర్జున్ సర్జా మాటలు
యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ కథ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్‌కి సంబంధించింది. మా సినిమాకి ప్రేమను, ప్రశంసల్ని కురిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మీడియాకి థాంక్స్. పదమూడేళ్ల క్రితం నేను చూసిన యాక్సిడెంట్‌తో ఈ మూవీ లైన్ తట్టింది. ఒక పది సెకన్లు వెనకా ముందు అయినా కూడా ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు. అలా అక్కడి నుంచి ఈ ఐడియా పుట్టింది. చూసిన ప్రతీ ఒక్కరూ తమ జీవితాన్ని చూసినట్టుగా ఉందని అంటున్నారు. చెడులోనూ మంచి ఉంటుందని ఇందులోని పాత్రలు రియలైజ్ అవుతుంటాయి. ప్రతీ ఒక్కరి జీవితం ఒక జర్నీలాంటిదే. నాకు నటన అంటే ఏంటో తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. ఆ తరువాత యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ తరువాత దర్శకత్వం చేయాల్సి వచ్చింది. ‘జెంటిల్‌మెన్’తో స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ తరువాత మళ్లీ బాధ్యత పెరిగినట్టు అయింది. ‘సీతా పయనం’ అవుట్ పుట్, రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నాను. నా కూతురు అద్భుతంగా నటించింది అని ప్రశంసిస్తున్నారు. నేను అక్కడే పాస్ అయ్యాను. అంటూ చెప్పుకొచ్చారు.
Read also- Podarillu Today Episode : కన్నా మాటతో మహా ఎమోషనల్.. కేశవ్, శైలు మధ్య ఫైట్.. మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న లలిత..
ఐశ్వర్య అర్జున్, నిరంజన్ ఏమన్నారంటే?
ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ మా అందరికీ చాలా ప్రత్యేకం. ఆడియెన్స్ ఇస్తున్న ప్రేమను చూస్తే ఇది మాకు మరింత స్పెషల్‌గా మారింది. ఆడియెన్స్, మీడియా ఇస్తున్న ప్రేమకు థాంక్స్. మా సినిమాని చూడని వారంతా కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అనూప్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నా నాన్న, నా దర్శకుడు, నా నిర్మాతకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు. నిరంజన్ మాట్లాడుతూ .. ‘నాలాంటి కొత్త వారిని సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఎన్నో విలువలతో తీసిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఐశ్వర్యతో పని చేయడం సంతోషంగా ఉంది. మాకు అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ’ అని అన్నారు. ఎక్కడ చూసినా మంచి ఓపినింగ్స్ రావడంతో మూవీ టీం మంచి జోష్ మీద ఉంది.
మొత్తానికి ‘సీతా పయనం’ చిత్రం విడుదల అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది. అర్జున్ సర్జా తన కూతురు నటనకు ఫిదా అయ్యానని చెప్పారు. సినిమా చూసిన వారందరూ తమ జీవితంలోని సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు.


