|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శేఖర్ బాషా అనసూయపై భగ్గు: ‘కొడుకు ఉన్నా మారవా..?’ అంటూ తీవ్ర హెచ్చరిక!

Published: 26-12-2025, 11:51 PM
శేఖర్ బాషా అనసూయపై భగ్గు: 'కొడుకు ఉన్నా మారవా..?' అంటూ తీవ్ర హెచ్చరిక!
  • నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి.
  • శివాజీ వ్యాఖ్యలను అనసూయ, చిన్మయి వంటి సెలబ్రిటీలు తప్పుబట్టారు, దీంతో వివాదం మరింత ముదిరింది.
  • ఆర్జే శేఖర్ బాషా ఈ వివాదంపై స్పందిస్తూ శివాజీకి మద్దతు పలికారు, అనసూయ వ్యాఖ్యలను ఖండించారు.
  • అనసూయను ఉద్దేశించి ‘కొడుకే అన్నా మారవా..? బజార్లో అలా ఉండొద్దు’ అంటూ శేఖర్ బాషా తీవ్ర హెచ్చరికలు చేశారు.

నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై అనసూయ స్పందించగా, ఆర్జే శేఖర్ బాషా ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. “కొడుకే అన్నా మారవా?” అంటూ అనసూయకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

శివాజీ వ్యాఖ్యలపై రచ్చ: వివాదం మొదలెక్కడ?

Sekar Basha : తెలుగు నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.. మహిళల వస్త్రధారణ పై శివాజీ అభ్యంతరకర మాటలు అనడంతో ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ శాతం మంది మాత్రం శివాజీకి మద్దతు తెలుపుతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే తమ ఇష్టమంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ వివాదం రోజురోజుకీ ముదురుతుంది. సినీ ఇండస్ట్రీలో దీనిపై అనేక చర్చలు కొనసాగుతున్నాయి. అనసూయ చిన్మయిలాంటివారు స్పందించి శివాజీ వ్యాఖ్యలను తప్పు పట్టడంతో ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు.. ఇక ఈ వివాదం పై ఆర్జే శేఖర్ బాషా రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆయన బిగ్ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అనసూయ వ్యాఖ్యల పై ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి తెలుసుకుందాం..

నటుడు శివాజీ అమ్మాయిల వస్తుంటారన్న పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దుమారం లేపుతున్నాయి. ఆయన మంచి ఉద్దేశంతో అన్నా కూడా కొందరు మాత్రం దాన్ని కావాలని గెలికి గెలికి వివాదంగా మారుస్తున్నారు. దీనిపై ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు జనాల్లోనూ ఒకటే మాట వినిపిస్తుంది. శివాజీ అన్న మాటలు తప్పే కాదు అని.. అమ్మాయిలు సామాన్లను కప్పుకొని పద్ధతిగా ఉండండి అని ఆయన అన్నారు. అందులో తప్పు లేదు అంటూ చాలామంది మహిళలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు ఆర్జే శేఖర్ ఈ వివాదం పై రియాక్ట్ అయ్యారు. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై సీరియస్ అయ్యారు.. శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు తప్పు అని కొందరు సెలబ్రిటీలు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడుగుతారు. దానిపై ఆయన మాట్లాడారు.. శివాజీ గారు అన్న దాంట్లో ఎటువంటి తప్పు లేదని శేఖర్ భాషా అన్నారు. ఇవాళ ఆయన అన్న మాటలు ని కొందరు తప్పుగా తీసుకున్న చాలా మంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఉండి అలాంటి కల్చర్ ని అలవాటు చేసుకోవడం ఇండియాకి తీసుకొచ్చి అలానే ఉండాలి అని అనుకోవడం తప్పు అని అనసూయ పై సీరియస్ అయ్యాడు. ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి. అంతగా అలాంటి బట్టలు వేసుకొని తిరగాలి అంటే మీ ఇంట్లో వేసుకో.. బజార్లో వేసుకోవడం మంచిది కాదు అని వార్నింగ్ ఇచ్చాడు శేఖర్ బాషా.. ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి ఈ ఏ వయసులో ఎలా ఉండాలో కూడా తెలుసుకొని ఉండాలి అని అనసూయకి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు.

అనసూయ స్పందనపై శేఖర్ బాషా ఆగ్రహం

అంతే కాదు గతంలో అనసూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ గురించి కూడా శేఖర్ బాషా ప్రస్తావించారు.. నేను అనసూయ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ని చూశాను. అందులో ఆమె బట్టల గురించి తన కొడుకు అన్న మాటలని గుర్తు చేశాడు. మమ్మీ ఇలాంటి బట్టలు వేసుకోవడం ఎందుకు అని ఆమెను కొడుకు అడిగితే.. ఇక్కడ ఇలానే ఉండాలి.. నీకేం తెలియదు అని చెప్పావు. చిన్నపిల్లాడు చెప్పిన నువ్వు తీసుకోవడం లేదు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు.. సమాజాన్ని చెడగొడుతున్నావ్.. ఇప్పటికైన పద్దతిగా ఉంటే మంచిదని అనసూయ పై ఫైర్ అయ్యాడు.

శేఖర్ బాషా తీవ్ర హెచ్చరిక: అనసూయకు కౌంటర్

ఇక చివరగా మంచు లక్ష్మీ గతంలో ఓ ఇంటర్వ్యూలో బిర్యానీ గురించి అన్న వీడియోను చూపించి ఫైర్ అయ్యాడు శేఖర్ బాషా. బిర్యానీ అన్ని రకాలుగా తినాలి అని ఆమె అనడంతో ఆయన తినకపోతే చచ్చిపోతాడా? తప్పు కదా అని అన్నాడు. బిర్యానీ తినకపోతే చచ్చిపోతాడా ఇలాంటివి మాట్లాడి సమాజానికి ఏం మెసేజ్లు ఇస్తున్నారు సెలబ్రిటీలు అంటూ కడిగి పడేసాడు శేఖర్ బాషా.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతారో అన్నది చూడాలి..

అనసూయ వ్యాఖ్యలపై శేఖర్ బాషా ఇచ్చిన కౌంటర్ ఈ వివాదాన్ని మరింత రాజుకునేలా చేసింది. సినీ వర్గాల్లో మహిళల వస్త్రధారణ, వ్యక్తిగత స్వేచ్ఛపై భిన్నాభిప్రాయాలు ఈ ఘటనతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.