|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Selvaraghavan: ఫోటోలు డిలీట్.. రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్

Published: 13-12-2025, 4:48 AM
Selvaraghavan: ఫోటోలు డిలీట్.. రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్
  • కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు.
  • భార్య గీతాంజలి ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్వరాఘవన్‌తో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడంతో పుకార్లు మొదలు.
  • ఇప్పటివరకు సెల్వరాఘవన్ లేదా గీతాంజలి ఈ వార్తలపై స్పందించలేదు.
  • సెల్వరాఘవన్ మొదటి భార్య సోనియా అగర్వాల్‌తో 2010లో విడాకులు తీసుకున్నారు.

కోలీవుడ్ దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన భార్య గీతాంజలి ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్వరాఘవన్‌తో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

సెల్వరాఘవన్ రెండో విడాకులపై ఊహాగానాలు

Selvaraghavan : సినిమా ఇండస్ట్రీలో ఎంత తొందరగా లవ్ లో పడతారో అంతే వేగంగా విడాకుల బాట కూడా పడుతూ ఉంటారు సెలబ్రిటీలు. కొంతమంది అలా విడాకులు కాగానే ఇలా రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. అయితే రెండోసారి కూడా దాంపత్యం బీటలు వారడం అన్నది అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ రెండోసారి కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

గీతాంజలి ఇన్‌స్టా పోస్ట్‌లతో మొదలైన చర్చ

తమిళ స్టార్ హీరో ధనుష్ బ్రదర్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నటుడు సెల్వరాఘవన్ మరోసారి విడాకుల బాట పడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి కారణం ఆవిడ భార్య చేసిన పనే. గీతాంజలి సెల్వరాఘవన్ తాజా తన ఇన్స్టా గ్రామ్ లో సెల్వరాఘవన్ తో ఉన్న ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసింది. ఆమె చేసిన ఈ పనే ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిచ్చింది. నిజానికి ఇటీవల కాలంలో ఇలా సోషల్ మీడియాలో ఫోటోలను రిమూవ్ చేసే డీవోర్స్ హింట్ ఇస్తున్నారు సెలఎబ్రిటీలు. అందుకే సెల్వరాఘవన్ కూడా తన రెండవ భార్యతో విడాకులు తీసుకోబోతున్నారు అనే గాసిప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనిపై ఇంకా సెల్వరాఘవన్ లేదా ఆయన భార్య స్పందించలేదు. దీంతో ఈ డైరెక్టర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మొదటి భార్య సోనియా అగర్వాల్‌తో విడాకులు

కాగా సెల్వరాఘవన్‌ మొదటి భార్య సోనియా అగర్వాల్‌. ‘7/G బృందావన్‌ కాలనీ’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన సోనియా అగర్వాల్‌, ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే దర్శకుడు సెల్వరాఘవన్‌ ప్రేమించుకున్నారు. 2006లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ళు గడిచాక మనస్పర్థల కారణంగా మ్యూచువల్ గా డివోర్స్ తీసుకున్నారు. 2010లో అఫిషియల్ గా సోనియా – సెల్వ విడిపోయారు. 2011లో సెల్వరాఘవన్ గీతాంజలి రామన్‌ను పెళ్లి చేసుకున్నారు.

సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేయడం విడాకుల హింట్‌గా భావించడం సాధారణమైపోయింది. సెల్వరాఘవన్-గీతాంజలి విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ వార్తలపై దంపతులిద్దరి నుండి స్పందన వస్తేనే అసలు నిజం తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.