|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Serial Actress: ఆన్‌లైన్‌లో వేధింపులు.. వ్యక్తిగతంగా అతడిని కలిసినా

Published: 04-11-2025, 3:17 AM
Serial Actress: ఆన్‌లైన్‌లో వేధింపులు.. వ్యక్తిగతంగా అతడిని కలిసినా

తెలుగు, కన్నడ సీరియల్ నటి ఆన్‌లైన్‌లో నెలల తరబడి వేధింపులు ఎదుర్కొంది. నవీన్ అనే వ్యక్తి ఫేక్ అకౌంట్లతో వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వ్యక్తిగతంగా కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో నటి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Key Points

1

తెలుగు, కన్నడ సీరియల్స్ చేసే నటికి నెలలుగా ఆన్‌లైన్‌లో వేధింపులు.

2

నవీన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో బ్లాక్ చేసినా ఫేక్ అకౌంట్లతో మెసేజ్‌లు, వీడియోలు పంపాడు.

4

నటి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు.

నటికి ఎదురైన వేధింపులు ఏం?

తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తున్న ఓ నటి.. నెలలుగా ఇబ్బంది పడుతోంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ నటిని వేధిస్తున్న వ్యక్తిని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.

వ్యక్తిగత భేటీతోనూ ప్రయోజనం లేదా?

ఏం జరిగింది? స్వతహాగా బెంగళూరుకి చెందిన ఓ నటి.. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తోంది. ఈమెకు ఓ రోజు నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కానీ ఈమె దీన్ని తిరస్కరించింది. పలుమార్లు ఇలానే చేసింది. దీంతో కక్ష పెంచుకున్న ఇతడు.. అభ్యంతరకర వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేయడంతో పలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మరీ సదరు నటికి మెసేజులు, వీడియోలు పంపిస్తూనే ఉ‍న్నాడు.

దాదాపు మూడు నెలల పాటు నవీన్ వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు నటి.. ఇక తట్టుకోలేక వ్యక్తిగతంగా అతడిని కలిసి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్‌లో నవీన్‌ని కలిసింది. ఇవన్నీ ఆపేయాలని కోరింది. అయినా సరే అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులని ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదు మేరకు నవీన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది.

పోలీసుల చర్య, దర్యాప్తు వివరాలు

సీరియల్ నటి ఆన్‌లైన్ వేధింపులపై ఫిర్యాదు చేయడంతో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదంతం మరోసారి గుర్తుచేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.