|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కమల్ కోసం షారుఖ్ ఫ్రీ సర్వీస్! టాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ వైరల్!

Published: 09-01-2026, 4:15 AM
కమల్ కోసం షారుఖ్ ఫ్రీ సర్వీస్! టాలీవుడ్ లో షాకింగ్ న్యూస్ వైరల్!
  • కమల్ హాసన్ ‘హే రామ్’ మూవీలో షారుఖ్ ఖాన్ ఉచితంగా నటించడం సంచలనం!
  • షారుఖ్‌కు కమల్ ఖరీదైన వాచ్ బహుమతిగా ఇవ్వడం హాట్ టాపిక్!
  • ‘హే రామ్’ హిందీ పంపిణీ, రీమేక్ హక్కులు షారుఖ్ సొంతం చేసుకున్నాడు!
  • కళను ప్రేమించే షారుఖ్ మనస్తత్వం వెలుగులోకి రావడంతో అభిమానుల్లో ఆనందం.

టాలీవుడ్ లో ఒక సంచలనం! షారుఖ్ ఖాన్ కమల్ హాసన్ కోసం పారితోషికం లేకుండా నటించాడంటే నమ్మగలరా? ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

షారుఖ్ ఖాన్ గొప్ప మనసు వెనుక అసలు కథ

భారత సినీ ప్రపంచంలో కమల్ హాసన్ సకల కళా సంగమం. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నట చక్రవర్తి. వీరిద్దరూ కలిసి పనిచేసిన సినిమా ‘హే రామ్’ (2000). ఇది ఒక క్లాసిక్ హిట్ గా నటిచింది. అయితే ఈ సినిమా వెనుక ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అవి షారుఖ్‌పై గౌరవాన్ని మరింతగా పెంచుతున్నాయి.

‘హే రామ్’ సినిమాను కమల్ హాసన్ స్వీయ నిర్మిస్తూ.. డైరెక్ట్ చేసి, నటించారు. షూటింగ్ సమయంలో బడ్జెట్ భారీగా  పెరిగిపోవడంతో, నటులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన షారుఖ్ ఖాన్ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆఈసినిమాలో నటించారు. .

‘హే రామ్’ సినిమాకు షారుఖ్ రెమ్యునరేషన్ తీసుకోలేదా?

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ, “షారుఖ్ ఈ సినిమాకు డబ్బు తీసుకోలేదు. ప్రతిఫలంగా నేను ఒక ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాను” అని చెప్పారు. ఈ సినిమా హిందీ పంపిణీ, రీమేక్ హక్కులు కూడా షారుఖ్‌కే దక్కాయి.

కమల్‌పై ఉన్న గౌరవంతోనే షారుఖ్ ఇలా చేశారు. కమల్ సాంకేతిక ప్రయత్నంలో భాగం కావాలనుకున్నారు. మత సామరస్యాన్ని చాటే అమ్జద్ అలీ ఖాన్ పాత్ర నచ్చడంతో, తోటి కళాకారుడికి భారం కాకూడదని ఆయన భావించారు. అందుకే డబ్బులు తీసుకోకుండా ఈసినిమాలో నటించారు షారుఖ్.

కమల్ హాసన్, షారుఖ్ స్నేహం గురించి తెలుసా?

సినిమాను వ్యాపారంగా చూసే ఇండస్ట్రీలో  కమల్-షారుఖ్  స్నేహం.. అప్పట్లోనే ఓ  కొత్త అధ్యాయాన్ని లిఖించింది. “కళను ప్రేమించేవారు డబ్బును పట్టించుకోరు” అనడానికి ‘హే రామ్’ సినిమా ఉదాహరణగా నిలిచింది.  షారుఖ్ గొప్ప మనసు దానికి  సాక్ష్యంగా మిగిలింది.

కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ ల మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి. త్వరలో మళ్ళీ కలుద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.