|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణవీర్ సింగ్: మూడు కేరవాన్ల వెనుక అసలు నిజం ఇదేనా? దురంధర్ మూవీ సీక్వెల్ విశేషాలు!

Published: 08-02-2026, 12:05 AM
రణవీర్ సింగ్: మూడు కేరవాన్ల వెనుక అసలు నిజం ఇదేనా? దురంధర్ మూవీ సీక్వెల్ విశేషాలు!
  • రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ మూవీ భారీ విజయం సాధించింది, రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
  • దురంధర్ మూవీ సెట్స్ లో రణవీర్ మూడు కేరవాన్స్ అడిగాడన్న వార్తల్లో నిజం లేదని నిర్మాత తెలిపారు.
  • రణవీర్ సింగ్ తన భార్యను ఫాలో అవుతున్నాడని వస్తున్న కామెంట్స్ లో వాస్తవం లేదని వెల్లడించారు.
  • దురంధర్ సీక్వెల్ కోసం రణవీర్ సింగ్ రోజుకు 12-15 గంటలు పనిచేశాడని నిర్మాత పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే షూటింగ్ సమయంలో మూడు కేరవాన్స్ అడిగాడని వస్తున్న వార్తలపై నిర్మాత స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.

దురంధర్ మూవీ సక్సెస్ వెనుక రణవీర్ కష్టం

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమధ్య దురంధర్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. భారీ యాక్షన్ చిత్రంగా థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడంతో అతని క్రేజీ ఒక్కసారిగా పెరిగింది.. 2025 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఒకవైపు సినిమాని బ్యాన్ చేయాలంటూ విమర్శలు కూడా వినిపించాయి. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్‌ కూడా వచ్చేస్తోంది. దురంధర్ ది రివేంజ్ పేరుతో ఆ మూవీ మార్చిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో రణవీర్ సింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇది బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. అసలేంటంటే..

దురంధర్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అయితే ఈ మూవీ రెండు పార్టీలు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పాఠం విడుదల చేసిన కొన్ని రోజులకి ఈ సినిమా విడుదల కావడం విశేషం.. దురంధర్ ది రివేంజ్ పేరుతో మార్చి నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. ధురంధర్‌ సినిమా సెట్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ఏకంగా మూడు కేరవాన్స్‌ అడిగాడని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పూకార్లు షికారు చేస్తున్నాయి.. తనకొక కేరవాన్‌, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్‌ అడిగాడన్నది అక్కడ న్యూస్.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలీవుడ్ సినీ అభిమానులు భార్యను ఫాలో అవుతున్నావా అంటూ రణవీర్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ఇందులో ఎటువంటి నిజంలేదని తెలుస్తుంది..

మూడు కేరవాన్స్ అడిగారన్న వార్తల్లో నిజమెంత?

ఇటీవల ఓ ప్రెస్ మీట్ కు దురంధర్ సినిమా నిర్మాత యూనిట్ సభ్యులలోని ఓ వ్యక్తి ఇంటర్వ్యూ ఇచ్చారు.. బ్యాంకాక్‌లో షూట్‌ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్‌ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు కార్లను ఎక్కువగా వాడాము.. అక్కడ లొకేషన్స్ మార్చిన సరే ఎక్కువగా కార్లనే వాడేమో అని ఆయన అన్నారు. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్‌ డిమాండ్‌ చేశాడన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని ఆయన అన్నారు.. అంతేకాదు రణవీర్ సింగ్ గొప్ప నటుడు. ఈ సినిమా సీక్వెల్ కోసం దాదాపు 12 నుంచి 15 గంటలు పని చేశాడు. సినిమా కోసం 15 కేజీల వరకు బరువు కూడా తగ్గారు అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక రణవీర్ సింగ్ ఈ మూవీ తర్వాత మరో భారీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రణవీర్ సింగ్ పై వస్తున్న కామెంట్స్ పై నిర్మాత స్పందన

Hamza Van Hamza’s staff Van Hamza’s Normal Van 😭😭🙏🏻 #RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY

— Bunny (@cinephilesonly) February 1, 2026

మొత్తానికి రణవీర్ సింగ్ మూడు కేరవాన్స్ అడిగారనే వార్తల్లో నిజం లేదని తేలింది. ఆయన తన సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని, అతని డెడికేషన్ వల్లే సినిమా సక్సెస్ అయిందని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.