|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆది సాయికుమార్ ‘శంబాల’ ఓటీటీ షాక్: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! రికార్డులు బద్దలు!

Published: 15-01-2026, 4:30 AM
ఆది సాయికుమార్ ‘శంబాల’ ఓటీటీ షాక్: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! రికార్డులు బద్దలు!
  • ఆది సాయికుమార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్: ‘శంబాల’ మూవీ సంచలన విజయం!
  • రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘శంబాల’ మూవీ రికార్డు కలెక్షన్లు
  • జనవరి 22న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం, ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
  • సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన శంబాల మూవీ!

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

‘శంబాల’ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Shambhala OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ చాలా ఏళ్ళ తరువాత హిట్ కొట్టాడు. ఆయనకు హిట్ అందించిన సినిమా శంబాల. సూపర్ నేచురల్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఓక రేంజ్ లో సర్ ప్రైజ్ చేసింది అనే చెప్పాలి. కథ రొటీన్ అయినా దానికి తెరకెక్కించిన తీరు చాలా కొత్తగా ఉంది. అందుకే ఈ సినిమాకు ఆడియన్స్ బాగా కనెప్ట్ అయ్యారు.

ఆహాలో స్ట్రీమింగ్.. ఫ్యాన్స్‌కు పండగే!

దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆది సాయికుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది.శంబాల(Shambhala OTT) ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే శంబాల మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేశారు.

బాక్సాఫీస్ దగ్గర ‘శంబాల’ రికార్డ్ కలెక్షన్స్!

డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాను సరిగ్గా నెలరోజులకు అంటే జనవరి 22న స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా పోస్టర్ విడుదల చేశారు. దీంతో, ఓటీటీ ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక ఓటీటీలో ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. థియేటర్స్ లో చూడని వాళ్ళు, చూసినవాళ్లు కూడా మళ్ళీ చూసే అవకాశం ఉంది.

శంబాల మూవీ ఓటీటీ రిలీజ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.