|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శని దేవునికి ప్రీతికరమైన 5 రాశులు: సమస్యల నుంచి త్వరిత విముక్తి!

Published: 18-04-2025, 10:10 PM
శని దేవునికి ప్రీతికరమైన 5 రాశులు: సమస్యల నుంచి త్వరిత విముక్తి!

శని దేవుడి ప్రభావం గురించి చాలామంది భయపడతారు. కానీ కొన్ని రాశుల వారికి శని దేవుడు ఎల్లప్పుడూ అనుగ్రహం చూపుతాడు. వారికి ఎదురయ్యే సమస్యల నుండి వేగంగా బయటపడటానికి శని దేవుడు సహాయపడతాడు.

Key Points

1

వృషభ, తులా, ధనస్సు, మకర రాశుల వారికి శని దేవుని ప్రత్యేక అనుగ్రహం.

2

శని దేవుని ఆశీస్సులతో సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.

4

న్యాయం, క్రమశిక్షణ, నిజాయితీ కలిగిన వారికి శని అనుగ్రహం అధికం.

వృషభ, తులా రాశులకు శని అనుగ్రహం

శని దేవుడు పేరు చెప్తే చాలు అందరూ కంగారు పడిపోతారు. విపరీతంగా భయపడి పోతారు. శని ప్రభావం పడితే ఇబ్బందులు కలుగుతాయని అంటారు. శని మకర , కుంభ రాశులకు అధిపతి. శని దేవుని గురించి చాలా కథలు కూడా ఉన్నాయి. శని మంచి కర్మలకు మంచి ఫలితాలను ఇస్తాడు.

చెడు కర్మలకు చెడు ఫలితాలని ఇస్తాడు. ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు శని దేవుడే బాధ్యత తీసుకుంటాడు. ఎవరైతే న్యాయం, క్రమశిక్షణ, నిజాయితీ లక్షణాలని కలిగి ఉంటారో వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. లేదంటే కఠినంగా శిక్షిస్తాడు.

శని దేవుడికి ఈ రాశుల వారు అంటే ఎంతో ఇష్టం. ఈ రాశుల వారికి శని దేవుడు ఎప్పుడూ మంచి ఫలితాలని ఇస్తాడు. మరి ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి శని ప్రత్యేక ఆశీస్సులు ఇస్తాడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు, శనికి మధ్య మంచి సంబంధం ఉంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఎప్పుడూ కూడా వృషభ రాశి వారికి ఆశీర్వాదాలను ఇస్తాడు. ఈ వ్యక్తుల జీవితంలో కష్టాలు రావచ్చు.

ధనస్సు, మకర రాశులపై శని ప్రభావం

కానీ వాటిని ఈ రాశి వారు ఎంతో దృఢంగా ఎదుర్కొంటారు. కుటుంబ, వృత్తి మధ్య సమతుల్యం ఉంటుంది. శని దేవుని ఆశీస్సులతో ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా కూడా అభివృద్ధి కలుగుతుంది.

తులా రాశి వారు కూడా శని దేవుడికి ఎంతో ప్రీతీ. తులా రాశి వారికి కూడా ఎప్పుడూ శని మంచి ఫలితాలను ఇస్తాడు. ఎప్పుడు ఈ రాశి వారికి శని దేవుడు శుభ ఫలితాలని ఇస్తాడు. జాతకంలో ఏదైనా గ్రహంతో శుభ స్థానంలో ఉంటే అది అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది.

తులా రాశి వారు ఎక్కువ కాలం కష్టాలని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని దేవుని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవం కూడా లభిస్తుంది.

ధనస్సు రాశి వారికి కూడా శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ధనస్సు రాశికి అధిపతి గురువు. శని, గురువు మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. ఈ కారణంగా శని దేవుడు ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. ధనస్సు రాశి వారికి ఆనందం , శ్రేయస్సు, సంపద, ఐశ్వర్యం ఉంటాయి. వీళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తారు. వీరి కృషి ఎప్పుడు సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కూడా సమస్యలు ఉండవు.

శని దేవుని ఆశీస్సులు పొందే మార్గాలు

శనికి మకర రాశి వారు అంటే కూడా ఎంతో ఇష్టం. మకర రాశి వారికి శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మకర రాశికి అధిపతి శని దేవుడు. మకర రాశి వారు సాడే సతి సమయంలో శని దేవుడుని ఆరాధిస్తే త్వరగా సమస్యల నుంచి బయటపడతారు. శని దేవుని ఆశీస్సులతో మకర రాశి వారు ఓర్పు, కష్టానికి ఫలితంగా జీవితంలో విజయాన్ని అందుకుంటారు. మకర రాశి వారు నిరంతరం పోరాడుతారు. శని దేవుడు దయతో వారి కృషి విజయవంతం అవుతుంది.

కుంభ రాశి కి కూడా శనదేవుడు అధిపతి. శని ప్రత్యేక ఆశీర్వాదాలు ఈ రాశుల వారిపై ఎప్పుడూ ఉంటాయి. శని దేవుని ఆశీర్వాదాలతో ఎప్పుడూ శుభ ఫలితాలను అందుకుంటారు. డబ్బు కొరత ఉండదు. విజయాలను అందుకుంటారు. వ్యాపారం, వృత్తి, కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. కుంభ రాశి వారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు శ్రేయస్సు, గౌరవాన్ని అందిస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

శని దేవుని అనుగ్రహం పొందాలంటే న్యాయం, నిజాయితీతో ఉండాలి. ఈ రాశుల వారు కష్టాలను సులభంగా అధిగమించి, జీవితంలో విజయం సాధిస్తారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.