|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శంకర్: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత వెయ్యి కోట్ల సినిమా.. నిర్మాతలు దొరికేసారు.. యోధుడి కథతో హిట్ కొడతాడా?

Published: 13-07-2025, 4:29 AM
శంకర్: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత వెయ్యి కోట్ల సినిమా.. నిర్మాతలు దొరికేసారు.. యోధుడి కథతో హిట్ కొడతాడా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు శంకర్ ఇటీవల వరుస ఫ్లాపులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన ‘వేల్పరి’ అనే భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంలో రూపొందనుంది.

Key Points

1

శంకర్ తదుపరి చిత్రం 'వేల్పరి'కి వెయ్యి కోట్ల బడ్జెట్!

2

కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్, సన్ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు!

4

‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ తర్వాత శంకర్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారా?

వేల్పరి: వెయ్యి కోట్ల బడ్జెట్ చిత్రం

Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ ఇటీవల ఫ్లాప్స్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇవ్వడంతో శంకర్ పని అయిపోయింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఇండియన్ 3 కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అది అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో శంకర్ తన డ్రీం ప్రాజెక్టు అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

‘వేల్పరి’ బుక్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నా డ్రీం ప్రాజెక్టు వేల్పరి. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సినిమాలకు వాడిన అత్యాధునిక టెక్నాలజీని వాడి ఆ రేంజ్ లో సినిమా తీయాలని ఉంది. ఇది మన తమిళ్ ఇండియన్ సినిమాగా గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. ఈ డ్రీం ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని అన్నారు. దీంతో శంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారగా పలువురు విమర్శలు చేస్తున్నారు.

శంకర్ కెరీర్ లో కీలకమైన ప్రాజెక్ట్

వేల్పరి సినిమాకు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం. వేల్పరి ఒక యోధుడు. కొన్ని వందల ఏళ్ళ క్రితం తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన యోధుడు. చోళులు, పాండ్యులను కూడా ఓడించాడు. ఆ చరిత్ర ఆధారంగా బుక్ రాయగా శంకర్ ఆ బుక్ ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తానంటున్నాడు. దీంతో అసలు ఇప్పుడు శంకర్ ని నమ్మి వెయ్యి కోట్లు ఎవరు పెడతారు అంటూ ట్రోల్స్ చేసారు.

నిర్మాతలు, విడుదల తేదీ వివరాలు

అయితే శంకర్ వేల్పరి సినిమాకు నిర్మాతలు దొరికారాని సమాచారం. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్, నెట్ ఫ్లిక్స్, సన్ పిక్చర్స్ సంస్థలు కలిసి శంకర్ వేల్పరి సినిమాని నిర్మిస్తాయని, వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టి ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా శంకర్ వేల్పరి నిలుస్తుందని తమిళ మీడియా అంటుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి నిజంగానే సన్ పిక్చర్స్, నెట్ ఫ్లిక్స్, కరణ్ జోహార్.. శంకర్ ని నమ్మి వెయ్యి కోట్ల బడ్జెట్ వేల్పరి సినిమాపై పెడతారా చూడాలి.

Also See : చనిపోయేవరకు నటిస్తానని చెప్పారు.. కోట శ్రీనివాసరావు గురించి పవన్ వ్యాఖ్యలు..

శంకర్ ‘వేల్పరి’ చిత్రం భారీ అంచనాలను పెంచింది. వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. శంకర్ కెరీర్ లో ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.