|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బ్రేకింగ్: షణ్ముఖ్ జశ్వంత్ లైఫ్‌లోకి కొత్త ప్రియురాలు! ‘దేవుడి బంధం’ అంటూ పోస్ట్ వైరల్!

Published: 02-01-2026, 3:30 AM
బిగ్ బ్రేకింగ్: షణ్ముఖ్ జశ్వంత్ లైఫ్‌లోకి కొత్త ప్రియురాలు! 'దేవుడి బంధం' అంటూ పోస్ట్ వైరల్!
  • షణ్ముఖ్ జశ్వంత్ తాజాగా తన కొత్త ప్రియురాలిని పరిచయం చేశాడు.
  • ‘దేవుడు నిర్ణయించిన బంధం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
  • ఆమె ముఖం కనిపించకుండా ఫొటోలు షేర్ చేయగా, ఆమె పేరు ‘V’ అక్షరంతో మొదలవుతుంది.
  • బిగ్‌బాస్ తర్వాత దీప్తి సునయనతో షణ్ముఖ్ బ్రేకప్ అయింది.

సోషల్ మీడియా సంచలనం షణ్ముఖ్ జశ్వంత్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. గత వివాదాల తర్వాత, తాజాగా తన కొత్త ప్రియురాలిని పరిచయం చేస్తూ ‘దేవుడు నిర్ణయించిన బంధం’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఆకస్మిక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షణ్ముఖ్ జశ్వంత్ గత బంధం, వివాదాలు

సెన్సేషనల్ ఇన్‌ఫ్లుయెన్సర్ షణ్ముఖ్ జశ్వంత్‌(Shanmukh Jaswanth)కు పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో పాటు కరవ్ సాంగ్స్‌లో కనిపించ ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు వచ్చింది. ఈక్రమంలోనే.. రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం లభించింది. ఇక ఇందులో పాల్గొన్న షణ్ముఖ్.. టాస్కుల్లో యాక్టివ్‌గా పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక హౌస్‌లో ఉన్న సమయంలో దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నట్లు రివీల్ చేశాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ షోలోనూ సిరి హన్మంత్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ ఏర్పడటంతో.. ఇంటి నుంచి బయటకు వచ్చాక తన ప్రేయసితో బ్రేకప్ అయిపోయింది. ఈ విషయం అప్పట్లోపెద్ద సెన్సేషన్‌గా మారింది.

కొత్త ప్రియురాలితో షణ్ముఖ్ గుడ్ న్యూస్

అంతేకాకుండా అనేవ వివాదాలు షణ్ముఖ్ చుట్టుముట్టాయి. అతనిపై ఏకంగా డ్రగ్స్ ఆరోపణలు రావడంతో.. పాటు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ వివాదాలు ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కొద్ది రోజులపాటు అన్నింటికి బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉన్నాడు. మళ్లీ ఇప్పుడిప్పుడే ఫామ్‌లో వస్తున్నాడు. మళ్లీ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా, కొత్త సంవత్సరం షణ్ముఖ్ గుడ్ న్యూస్ చెప్పాడు. నేడు తన ప్రియురాలిని పరిచయం చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు కానీ ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఆమెకు పుట్టినరోజు విషెస్ చెప్తూ.. దేవుడు నిర్ణయించిన బంధం అని క్యాప్షన్ జత చేశాడు. అంతేకాకుండా V అంటూ ప్రియురాలిని సంభోధించడంతో.. ఆమె పేరు వి అక్షరంతో మొదలవుతుందని అర్థమవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అన్నా ఫైనల్లీ రెండో ప్రయాణం మొదలెట్టావు.. ఏంటి ఈ సర్‌ప్రైజ్ ఊహించలేదు.. కంగ్రాట్స్ అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న పోస్ట్: ‘V’ పేరు వెనుక రహస్యం?

A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)

షణ్ముఖ్ జశ్వంత్ కొత్త బంధంతో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ గుడ్ న్యూస్‌పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘V’ అక్షరంతో ప్రారంభమయ్యే ఆమె పేరు, పూర్తి వివరాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.