|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షణ్ముఖ్ షాకింగ్ ట్విస్ట్! దీప్తితో బ్రేకప్ తర్వాత కొత్త ప్రేయసిని పరిచయం చేసిన షన్ను.. పెళ్లి కూడా?

Published: 02-01-2026, 1:30 AM
షణ్ముఖ్ షాకింగ్ ట్విస్ట్! దీప్తితో బ్రేకప్ తర్వాత కొత్త ప్రేయసిని పరిచయం చేసిన షన్ను.. పెళ్లి కూడా?
  • దీప్తి సునైనాతో సుదీర్ఘ బ్రేకప్ తర్వాత యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కొత్త ప్రేమలో పడ్డాడు.
  • పుట్టినరోజు సందర్భంగా ప్రేయసిని పరిచయం చేసిన షణ్ముఖ్, త్వరలో పెళ్లి వార్తను పరోక్షంగా కన్ఫామ్ చేశాడు.
  • కొత్త అమ్మాయి వివరాలు, ముఖం గోప్యంగా ఉంచిన షన్ను, అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్నాడు.
  • బిగ్‌బాస్ తర్వాత సినిమాలతో దూసుకుపోతున్న షణ్ముఖ్ జస్వంత్, లీలా వినోదం, ప్రేమకు నమస్కారం చిత్రాలు చేస్తున్నాడు.

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తన అభిమానులకు షాకింగ్ వార్తను అందించాడు. దీప్తి సునైనాతో బ్రేకప్ అయిన తర్వాత కొత్త అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, ఆమెను తన జీవితంలోకి ఆహ్వానిస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు పరోక్షంగా చెప్పాడు. ఈ వార్త ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

షణ్ముఖ్-దీప్తి బ్రేకప్ వెనుక అసలు కథ

షణ్ముఖ్ జశ్వంత్… ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలతో మొదలుపెట్టి, తన డ్యాన్స్ లు, వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయ్యాడు. షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక.. షణ్ముఖ్ పేరు వినపడగానే.. వెంటనే దీప్తి సునైనా పేరు కూడా వినపడుతుంది.వీరిద్దరూ కలిసి చాలా డ్యాన్స్ వీడియోలు చేశారు. వీరి జంటకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.

వీరిద్దరూ చాలా సంవత్సరాలపాటు రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి స్పెషల్ గా టాటూలు కూడా వేయించుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. తామిద్దరం విడిపోయాం అంటూ సోషల్ మీడియాలో అధికారికంగా  ప్రకటించారు. షన్ను తనకు ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు.విన్నర్ అవ్వాల్సిన వాడు రన్నరప్ గా నిలిచాడు. అయితే.. అక్కడి అతని ప్రవర్తన నచ్చక.. దీప్తి సునైనా బ్రేకప్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే.. ఈ జంట మళ్లీ కలవాలని వారి అభిమానులు చాలా గట్టిగానే కోరుకున్నారు. కానీ, అది జరగలేదు. ఇద్దరూ తమ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు.

కొత్త అమ్మాయితో షణ్ముఖ్ ప్రేమాయణం.. పెళ్లి ఎప్పుడంటే?

మళ్లీ ఈ జంట ఎప్పటికైనా కలుస్తారని వారి అభిమానులు ఎదురు చూశారు. కానీ.. సడెన్ గా షణ్ముఖ్ ట్విస్ట్ ఇచ్చాడు. నిజంగానే.. దీప్తితో బ్రేకప్ నుంచి బయటపడినట్లు ప్రకటించాడు. మరో అమ్మాయితో తన రెండో ప్రయాణం మొదలైందని చెప్పాడు. తాను మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లు ఫోటోలు షేర్ చేశాడు. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు.. ఆమె ఫేస్ కూడా ఫోటోలో క్లియర్ గా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. తమ ప్రేమను కన్ఫామ్ చేశాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ ఇది ప్రకటించగానే… అభిమానులంతా శుభాకాంక్షలు తెలియజేశారు.

బిగ్‌బాస్ తర్వాత షణ్ముఖ్ కెరీర్ అప్‌డేట్స్

దీప్తితో బ్రేకప్ అయిన తర్వాత షణ్ముఖ్ చాలా కాలం డిప్రెషనల్ లోకి వెళ్లిపోయాడు.కానీ, తర్వాతర్వాత దాని నుంచి బయటపడ్డాడు.ఇప్పుడు హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఓటీటీలో లీలా వినోదం అనే సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రేమకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా విడుదల కానుంది. శివాజీ, బ్రహ్మాజీ లాంటి హేమాహేమీలతో కలిసి షణ్ముఖ్ ఈ మూవీలో తెర పంచుకోవడం విశేషం.

షణ్ముఖ్ జస్వంత్ తన కొత్త జీవితాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీప్తితో బ్రేకప్ బాధ నుంచి బయటపడి, తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ముందుకు సాగుతున్న షణ్ముఖ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.