|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రాణాలు పణంగా పెట్టినా పట్టించుకోలేదా? శర్వానంద్ సంచలన కామెంట్స్ వైరల్!

Published: 08-04-2026, 5:05 AM
షాకింగ్: ప్రాణాలు పణంగా పెట్టినా పట్టించుకోలేదా? శర్వానంద్ సంచలన కామెంట్స్ వైరల్!
  • శర్వానంద్ నటించిన ‘జాను’ మూవీ షూటింగ్‌లో స్కైడైవింగ్ ప్రమాదం, భుజం ఎముక విరగడంతో తీవ్ర గాయాలు!
  • థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ప్రమాదం.. శర్వానంద్ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన రోజులు!
  • పెద్ద హీరోలకు చిన్న దెబ్బ తగిలినా వైరల్ అవుతుంది, కానీ నా విషయంలో ఎవరూ పట్టించుకోలేదని శర్వానంద్ ఆవేదన!
  • ప్రస్తుతం సోషల్ మీడియాలో శర్వానంద్ ఎమోషనల్ వీడియో వైరల్.. అభిమానుల ప్రశంసలు, మద్దతు లభిస్తోంది!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘జాను’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

స్కైడైవింగ్ చేస్తుండగా ప్రమాదం.. శర్వానంద్ తీవ్ర గాయాలు!

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, తన కెరీర్‌లో ఎదురైన అత్యంత కష్టమైన , ఎమోషనల్ క్షణాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఆయన నటించిన ‘బైకర్’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, తన గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. శర్వానంద్ మాట్లాడుతూ.. ‘జాను’ మూవీ షూటింగ్ సమయంలో తనకు జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలిపారు. “ఆ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో భారీ ప్రమాదం జరిగింది. నా భుజం ఎముక పూర్తిగా విరిగిపోయింది. అది ఎంత క్లిష్టమైన సర్జరీ అంటే, కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ఆ సమయంలో ఆ ప్రమాదం గురించి పరిశ్రమలో గానీ, బయట గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు” అని శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు.

ఒక నటుడిగా సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేసినప్పుడు, కనీసం సానుభూతి లేదా గుర్తింపు లభించకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన అన్నారు. “ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి విలువ లేనప్పుడు, నేను ఇండస్ట్రీలో అంత తక్కువ వాడినా? అని నాకు అనిపించింది. నా కష్టానికి గుర్తింపు లేదా అని చాలా బాధపడ్డాను” అంటూ తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. సాధారణంగా పెద్ద హీరోలకు చిన్న దెబ్బ తగిలినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. కానీ తాను అంత పెద్ద సర్జరీ చేయించుకున్నా ఎవరూ స్పందించకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని శర్వానంద్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయంపై తెలుసుకున్న అభిమానులు శర్వానంద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టానికి తగ్గ ఫలితం ఇకపై దక్కుతుంది అన్న అధైర్య పడకని అంటున్నారు.

గుర్తింపు లేక కుంగిపోయిన శర్వానంద్.. ఎమోషనల్ కామెంట్స్!

వైరల్ అవుతున్న శర్వానంద్ వీడియో.. అభిమానుల మద్దతు!

శర్వానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.