
📌 Key Points
- శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతికి విడుదలైంది.
- సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ అని టాక్ తెచ్చుకుంది, రివ్యూలు కూడా బాగున్నాయి.
- థియేటర్ల కొరత, ప్రమోషన్లు సరిగా లేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారాయి.
- కథ, కామెడీ బాగున్నా థియేటర్లు తక్కువగా ఉండటం వల్ల ఆశించిన విజయం సాధించలేదు.
శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతికి విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, థియేటర్ల కొరత కారణంగా సినిమాకు అన్యాయం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రమోషన్ల లోపం కూడా తోడైంది.
శర్వానంద్ సినిమాకు థియేటర్ల సమస్య
Sharwanand : సాధారణంగా ఒక సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది అంటే అది కంటెంట్ బాగుంటే ఎలా అయినా సరే సక్సెస్ అవుతుందని ఇన్ని రోజులు అనుకునే వాళ్ళం.. కానీ శర్వానంద్ మూవీకి జరిగిన అన్యాయం చూస్తే మాత్రం కంటెంట్ ఉంటే సరిపోదు అందుకు తగ్గ కష్టం కూడా ఉండాలి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా శర్వానంద్ ఇటీవల అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ కూడా .. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అందుకుంటుందని, సంక్రాంతి సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా బొక్క బోర్ల పడిందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) తాజాగా ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాస్తవానికి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలో కల్లా మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా నిలిచింది నారీ నారీ నడుమ మురారి. అయితే ఈ సినిమా కంటే ముందు విడుదలైన చిత్రాలు అనగా చిరంజీవి (Chiranjeevi )’మన శంకర వరప్రసాద్ గారు’, ప్రభాస్(Prabhas )’ది రాజా సాబ్’ , నవీన్ పోలిశెట్టి(Naveen Polisetty)’ అనగనగా ఒక రాజు’ చిత్రాలకు థియేటర్లు ఎక్కువ కేటాయించారు. ఈ నేపథ్యంలోనే నారీ నారీ నడుమ మురారి చిత్రానికి థియేటర్ల కొరత ఏర్పడడంతో కంటెంట్ బాగున్నా థియేటర్లు లేకపోవడం వల్ల ఆడియన్స్ కూడా ఇబ్బంది పడ్డారు.
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ
దీనికి తోడు ఈ సినిమా చాలా బాగుంది అనే టాక్ వచ్చింది. అటు కథ పరంగా, కామెడీ పరంగా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ఇదే బెస్ట్ అంటూ రివ్యూలు కూడా వచ్చాయి. కానీ థియేటర్లు దక్కలేదు. దీనికి తోడు పి ఆర్ కూడా సరిగ్గా చేయలేదు. ఇక సినిమా రిలీజ్ కి ముందు శర్వానంద్ కూడా ప్రమోషన్స్ చేయలేదు. ప్రస్తుతం కథ , కామెడీ వల్ల పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఇప్పుడిప్పుడే థియేటర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అప్పటికే ఈ సినిమాకు అన్యాయమైతే జరిగిందని చెప్పుకోవచ్చు. పాపం కంటెంట్ బాగున్నప్పటికీ చిన్న చిన్న మిస్టేకుల వల్ల శర్వానంద్ మూవీకైతే ఈ సంక్రాంతికి అన్యాయం జరిగిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది.
నారీ నారీ నడుమ మురారి సినిమా విషయానికొస్తే.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఇందులో సాక్షి వైద్య , సంయుక్త హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ లేకపోవడం, థియేటర్ల కొరత వల్ల కేవలం 21 కోట్లు మాత్రమే వచ్చింది. మరి ఇప్పుడిప్పుడే థియేటర్లు దొరుకుతున్న నేపథ్యంలో కనీసం మునుముందైన ఈ సినిమా బడ్జెట్ ను కంప్లీట్ గా కవర్ చేస్తుందేమో చూడాలి.
ప్రమోషన్ల లోపం, ఫలితం లేని కష్టం
మొత్తానికి శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి కంటెంట్ ఉన్నప్పటికీ, థియేటర్ల కొరత మరియు ప్రమోషన్ల లోపం కారణంగా సంక్రాంతి బరిలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.


