
📌 Key Points
- శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది.
- శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ కొత్త సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
- మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
- గతంలో శతమానంభవతి సినిమాతో సంక్రాంతికి వచ్చి శర్వానంద్ హిట్ కొట్టారు.
శర్వానంద్ మరోసారి సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో 2027 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. గతంలో సంక్రాంతికి శతమానంభవతితో హిట్ కొట్టారు.
సంక్రాంతి బరిలో శర్వానంద్ సినిమాలు
Sharwanand: సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఐదు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో శర్వానంద్ (Sharwanand) హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి సినిమా ఒకటి సినిమా. ఈ సినిమా జనవరి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా శర్వానంద్ సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలో శతమానంభవతి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఈ ఏడాది కూడా స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ ఈయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంక్రాంతి బరిలో దిగి హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ మరో కొత్త సినిమాని కూడా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారనీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం శర్వానంద్ బైకర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్
ఇక ఈ ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.. ఈ సినిమా కాకుండా శర్వానంద్ తన తదుపరి సినిమాను ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla)దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీను వైట్ల ఇటీవల కాలంలో తన సినిమాలతో మెప్పించలేకపోయారు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైన శ్రీనువైట్ల గత ఏడాది గోపీచంద్ తో కలిసి విశ్వం అనే సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా థియేటర్లలో అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
2027 సంక్రాంతిని టార్గెట్ చేసిన శర్వానంద్..
2027 సంక్రాంతి టార్గెట్‌గా సినిమా
ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శర్వానంద్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారంటూ వార్తలు రావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ కు సంక్రాంతి బాగా కలిసి వచ్చింది అందుకే మరొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా 2027 సంక్రాంతి బరిలో రాబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించిన నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.
మొత్తానికి శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతూ 2027 సంక్రాంతికి శ్రీను వైట్ల దర్శకత్వంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.


