
📌 Key Points
- శర్వానంద్ హీరోగా ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం నుంచి డబుల్ అప్డేట్స్ వచ్చాయి.
- టీజర్ డిసెంబర్ 22న, రిలీజ్ జనవరి 14న అని మేకర్స్ ప్రకటించారు.
- రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, సంయుక్తా మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- మూవీ ప్రమోషనల్ వీడియోతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
శర్వానంద్ నటిస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం నుంచి డబుల్ అప్డేట్స్ విడుదలయ్యాయి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ డిసెంబర్ 22న రానుండగా, జనవరి 14న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ప్రకటన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
‘నారి నారి నడుమ మురారి’: పూర్తి వివరాలు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
టీజర్, రిలీజ్ డేట్ ప్రకటన: హైప్ మామూలుగా లేదు
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అంచనాలను పెంచగా.. తాజాగా ఈ మూవీ టీజర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇక ఆ వీడియోలో.. ‘లాయర్ వెన్నెల కిషోర్ దగ్గరికి హీరో శర్వానంద్, సీనియర్ యాక్టర్ నరేష్, కమెడియన్ సుదర్శన్ వస్తారు. అప్పడు వాళ్లని చూసి ఇంత కాంపిటీషన్‌లో నీ ఎంట్రీ కూడా అవసరమా అని అడుగుతాడు. అప్పుడు శర్వానంద్.. ప్రతి పండక్కి పని అయింది కదా సార్ ఈ పండక్కి కూడా కొడదామని అని ఆన్సర్ చేస్తాడు.
వైరల్ అవుతున్న వీడియో.. ఫ్యాన్స్ కామెంట్స్
అప్పుడు వెన్నెల కిషోర్ అబ్బా.. ఈడు మారడు.. నాకు తెలిసి నీకు కొంచెం తుత్తుర ఎక్కువే అంటాడు. అప్పుడు ఆ ముగ్గురు కరెక్ట్ సార్ అని అంటారు. ఇక వీడియో ఎండింగ్‌లో టీజర్ డిసెంబర్ 22వ తేదీన అని, జనవరి 14న సాయంత్రం 5గం 49 నిమిషాల నుంచి థియేటర్లలో నవ్వులు స్టార్ట్ అవుతాయని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ వీడియోతోనే హైప్ పెంచేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ స్పెషల్ వీడియోతో ‘నారి నారి నడుమ మురారి’పై అంచనాలు భారీగా పెరిగాయి. శర్వానంద్ మార్క్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే టీజర్, సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఉత్సాహంగా ఉన్నారు.


