|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ షాకింగ్ అప్డేట్: ఫస్ట్ హాఫ్ రెడీ! సెకండ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Published: 12-01-2026, 9:00 PM
రామ్ చరణ్ 'పెద్ది' షాకింగ్ అప్డేట్: ఫస్ట్ హాఫ్ రెడీ! సెకండ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఫస్ట్ హాఫ్ కట్ సిద్ధం!
  • మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ‘పెద్ది’!
  • ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్!
  • త్వరలోనే ‘పెద్ది’ సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్న మేకర్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ఒక సంచలన అప్డేట్! ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఫస్ట్ హాఫ్ కట్ రెడీ చేసిన మేకర్స్!

Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగ్గట్టుగానే, మేకర్స్ ఈ సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ తో డిజప్పాయింట్ అయిన తన ఫ్యాన్స్ పెద్ది(Peddi Update) సినిమాతో కాలర్ ఎగరేసుకునేలా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రామ్ చరణ్ మాస్ యాక్షన్ సీన్స్!

చికిరి సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. తాజాగా పెద్ది సినిమా భారీ క్లైమాక్స్‌ షూటింగ్ కూడా ప్రారంభించారట. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చరణ్‌తో పాటు ప్రధాన పత్రాలపై యాక్షన్‌ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు.

సెకండ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

ఇక ఇప్పటికే పెద్ది సినిమా ఫస్ట్‌ హాఫ్‌ కట్‌ సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం సెకండాఫ్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అనుకున్న తేదీకి అనుకున్నట్టుగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే పెద్ది సినిమా నుంచి రెండో పాటను కూడా విడుదల కానుందట. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. వేచి చూడండి! మెగా అభిమానులకు పండగే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.