
నటుడు శశికుమార్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ఒక యంగ్ హీరోయిన్ తో కలిసి ఆయన నటించనున్నారు.
Key Points
శశికుమార్ తదుపరి చిత్రం యంగ్ హీరోయిన్ తో ఉంటుంది.
'టూరిస్ట్ ఫ్యామిలీ' తర్వాత ఆయన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు.
శశికుమార్ 'ఫ్రీడమ్' చిత్రంతో జూలై 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
'వదంతి 2' వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది.
శశికుమార్ కెరీర్‌లో తదుపరి అడుగు
వైవిధ్య కథాచిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న ‘శశికుమార్’ వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన ‘అయోద్ధి’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సూరి కథానాయకుడిగా నటించిన ‘గరుడన్’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శశికుమార్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల నటి సిమ్రాన్‌తో కలిసి నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం శశికుమార్ హీరోగా నటించిన ఫ్రీడమ్ చిత్రం జూలై 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈయన తొలిసారిగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు.
ఇంతకు ముందు రూపొందిన వదంతి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వదంతి–2 రూపొందుతోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో సాగే ఈ వెబ్ సిరీస్‌లో నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మదురై, తిరునల్వేల్లి ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్‌లో తాను శశికుమార్‌కు జంటగా నటిస్తున్నట్లు నటి ‘అపర్ణదాస్'(Aparna Das) ఇటీవల ఒక భేటీలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల బ్యూటీ 50 ఏళ్లకు పైగానే ఉన్న శశికుమార్‌కు జంటగా నటించనుంది.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తర్వాత ప్రణాళికలు
ఆమె ఇప్పటికే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించారన్నది గమనార్హం. ముఖ్యంగా తమిళంలో నటుడు విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ నాలుగైదు చిత్రాల్లో నటించారు. తమిళంలో ఆమె నటించి ‘దాదా’ (పాపా) సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడా చిత్రం తెలుగులో జూన్ 12న విడుదల కానుంది.
వెబ్ సిరీస్ ‘వదంతి 2’ షూటింగ్
కాగా దీని తరువాత శశికుమార్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈయన మెగాఫోన్ పట్టి శ్రీకుట్రపరంపరైశ్రీ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయకాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని శశికుమార్‌నే ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు.
శశికుమార్ తన వరుస విజయాలతో పాటు, దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ‘వదంతి 2’ మరియు కొత్త సినిమాతో ఆయన ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.


