
📌 Key Points
- శివాజీ రీఎంట్రీతో వెండితెరపై సందడి, ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తండ్రి పాత్రలో సరికొత్తగా!
- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఎపిక్ చిత్రంలో శివాజీ కీలక పాత్ర!
- ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేటర్లలో విడుదల, శివాజీ నటనకు ప్రశంసలు!
- 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌తో శివాజీకి మంచి గుర్తింపు, వరుస ఆఫర్లు!
సీనియర్ నటుడు శివాజీ మళ్ళీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. బిగ్ బాస్ తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఒక ఎపిక్ చిత్రంలో నటించనున్నారు.
తండ్రి పాత్రలో శివాజీ.. లుక్ అదిరింది!
సీనియర్ నటుడు శివాజీ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈయన నటించిన 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది.
ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఎపిక్ చిత్రం!
దానితో శివాజీకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత శివాజీకి వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి. ఈ నటుడు ఈ మధ్యకాలంలోనే అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా శివాజీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీని మొదట ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా థియేటర్లలోనే విడుదల చేశారు. నిన్న విడుదల అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.
రీఎంట్రీలో శివాజీకి భారీ ఆఫర్లు!
ఈ సినిమా విడుదల సందర్భంగా శివాజీ చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఆదిత్య హాసన్ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ చిత్రంలో నేను నటిస్తున్నాను, ఈ సినిమాలో నేను తండ్రి పాత్రలో కనిపించబోతున్నాను. ఆ పాత్రలో నా లుక్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. తండ్రి పాత్రలో ఓ వ్యక్తి ఎలా కనిపించాలో అలా నా లుక్ ఉంటుంది. ఆదిత్య సినిమాను కూడా చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఎపిక్ చిత్రం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రూపొందుతోంది.
శివాజీ గారి రీఎంట్రీ టాలీవుడ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆయన నటిస్తున్న ఈ ఎపిక్ చిత్రం గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


