|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: యాదగిరిగుట్టలో శివాజీకి ఊహించని నష్టం! రూ.1800 కోట్లు గోవిందా?

Published: 03-03-2026, 8:35 PM
షాకింగ్: యాదగిరిగుట్టలో శివాజీకి ఊహించని నష్టం! రూ.1800 కోట్లు గోవిందా?
  • శివాజీ: యాదగిరిగుట్టలో 70 వేల స్థలం కొని 9 లక్షలకు అమ్మినా, ఇప్పుడు దాని విలువ రూ. కోట్లు!
  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 18 ఎకరాలు తక్కువకు అమ్మడంతో రూ.1800 కోట్ల నష్టం వాటిల్లిందని శివాజీ సంచలన ప్రకటన!
  • లయతో కలిసి ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’ మూవీలో శివాజీ నటన, మార్చి 6న థియేటర్లలో విడుదల!
  • అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న లెనిన్ సినిమాలో శివాజీ కీలక పాత్ర, త్వరలో ప్రేక్షకుల ముందుకు!

టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్థలం గురించి, భారీ నష్టం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్దాం!

యాదగిరిగుట్ట స్థలం వెనుక అసలు కథ

Shivaji: టాలీవుడ్ నటుడు శివాజీ గురించి, ఆయన చేసిన సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా, హీరోగా ఆయన చేసిన చాలా సినిమాలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంకా తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ రాజకీయాలపై దృష్టి సారించాడు. ఇక బిగ్ బాగ్ లో పాల్గొన్న తరువాత శివాజీ ఫేట్ మారిపోయింది. ఆ ఫేమ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శివాజీ.. ఆ తరువాత 90’స్ బయోపిక్, కోర్ట్, దండోరా లాంటి సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ వస్తున్నాడు.

తాజాగా శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’. సీనియర్ హీరోయిన్ లయ శివాజీ(Shivaji)కి జంటగా చేస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముందు ఓటీటీలో విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రూ.1800 కోట్ల నష్టం ఎలా జరిగింది?

ఈనేపథ్యంలోనే ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.. నేను సినిమాలకు దూరం అయ్యాక రొటేషన్ కోసం స్థలాలు కొని అమ్మడం చేసేవాడిని. అలా యాదగిరిగుట్ట దగ్గరలో రూ.70 వేలకు కొని రూ.9 లక్షలకు అమ్మాను. కానీ, తర్వాత ఆ స్థలం ధర చాలా పెరిగింది.

శివాజీ నెక్స్ట్ మూవీ అప్‌డేట్స్

హైదరాబాద్ లో కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్థలంలో దాదాపు 18 ఎకరాలు కొని తక్కువ లాభానికే అమ్మను. అక్కడ అదే స్థలం ఇప్పుడు ఒక్కొక్క ఎకరం రూ.100 కోట్లు ఉంది. అలా, దాదాపు రూ.1800 కోట్లు నష్టపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో శివాజీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శివాజీ అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న లెనిన్ సినిమాలో కూడా కీ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

శివాజీ గారి కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన సినిమా విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.