
📌 Key Points
- హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద వివాదం సృష్టించాయి.
- అనసూయ, చిన్మయి శివాజీని లక్ష్యంగా చేసుకుని వరుస పోస్టులతో సంచలనం సృష్టిస్తున్నారు.
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వివాదంలోకి రావడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందారు.
- ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట వివాదాస్పద పదాలపై ప్రశ్నలు రేపింది.
టాలీవుడ్‌లో శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అనసూయ, చిన్మయి వంటి తారలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అనూహ్యంగా ఈ వివాదంలోకి రామ్ చరణ్ భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా రావడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. మెగా అభిమానుల్లో ఇది చర్చకు దారితీస్తోంది.
శివాజీ కామెంట్స్‌తో టాలీవుడ్‌లో దుమారం!
శివాజీ (Shivaji)హీరోయిన్ల దుస్తులపై చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఈవివాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా నోటీసుల వరకు వెళ్లింది. అంతేకాకుండా.. ఓ స్టార్ సినిమాను ఈ వివాదంలోకి లాగేశారు.అందం అనేది నిండుగా ఉన్న బట్టలు, చీరలు కట్టుకోవడం వల్ల ఉంటంది. కానీ సామాన్లు కనిపించేలా వేసుకుంటే ఉండదు అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అలాగే ముం** లు , సామాన్లు అనే పదాలు సంచలనంగా మారాయి. ఈ విషయంపై పలువురు హీరోయిన్లతో పాటు నటులు కూడా తమదైన స్టైల్లో స్పందించిన విషయం తెలిసిందే. ఇక చిన్మయి, అనసూయ (Anasuya)మాత్రం గత మూడు రోజుల నుంచి వరుస పోస్టులతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. శివాజీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ టార్గెట్ చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ శివాజీ మాత్రం ఏ మాత్రం భయపడటం లేదు వారికి తగినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వివాదంలోకి అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా తీసుకురావడంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.
అసలేం జరిగిందంటే..శివాజీకి సపోర్ట్ చేస్తున్న వారు.. ఆయన చెప్పిన మాటల్లో తప్పు అంటున్నారు. మరి ‘పెద్ది’ (peddi) సినిమాలో ‘చికిరి చికిరి’ పాటలో వాడిన పదాలు తప్పుగా అనిపించలేదా? అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. మరి శివాజీని వ్యక్తిరేకంగా మాట్లాడే అనసూయ, చిన్మయి చికిరి చికిరి పాటలో వచ్చిన అశ్లీల పదాలపై ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని పలు పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీస్తున్నారు. ఇక ఈ విషయంపై ‘పెద్ది’ టీమ్ స్పందిస్తుందా? లేదా చూడాలి. కాగా.. రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ ఇందులో కనిపించనున్నారు. షూటింగ్ జరుపుకుంటన్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. శివాజీ వివాదం కాస్త ‘పెద్ది’ని చిక్కుల్లో పడేయడంతో ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
వివాదంలోకి రామ్ చరణ్ ‘పెద్ది’ ఎందుకు?
‘పెద్ది’ టీమ్ స్పందన ఉంటుందా?
శివాజీ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ‘పెద్ది’ సినిమా ఈ వివాదంలోకి రావడంతో హాట్‌టాపిక్‌గా మారింది. చిత్ర బృందం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కొనసాగుతోంది.


