|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఓటీటీకి హ్యాండిచ్చిన శివాజీ! థియేటర్లలో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ రిలీజ్!?

Published: 10-02-2026, 12:35 PM
షాకింగ్: ఓటీటీకి హ్యాండిచ్చిన శివాజీ! థియేటర్లలో 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీ రిలీజ్!?
  • శివాజీ, లయ జంటగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ; సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు!
  • ప్రేమికుల రోజు కానుకగా ఓటీటీ రిలీజ్ ఆగినట్టేనా? మార్చిలో థియేటర్లలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్!
  • దర్శకుడు అనిల్ రావిపూడి సైతం ట్రైలర్ చూసి సినిమాను థియేటర్లో రిలీజ్ చేయమని సూచించారు.
  • ఈ సినిమాలో రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

శివాజీ రీఎంట్రీతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది! ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీతో ఆయన థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఓటీటీ రిలీజ్ అనుకున్న సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఓటీటీ నుండి థియేటర్లకు: శివాజీ సంచలన నిర్ణయం!

ఇటీవల చాలా సినిమాలు థియేటర్లు ఆడకపోయినా ఓటీటీలో మాత్రం బాగా ఆడుతున్నాయి. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన మూవీస్‌ ఓటీటీ మాధ్యమాల్లో మాత్రం సూపర్‌ హిట్ అవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీ కోసం చేసిన సినిమాలు కూడా థియేటర్‌ రేంజ్‌ కంటెంట్‌తో ఉండటం విశేషం. ఆ మధ్య `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ ఓటీటీ కోసం చేశారు ఈటీవీ విన్‌, వేణు ఉడుగుల. కానీ కంటెంట్‌ వచ్చిన తీరుని చూసి థియేటర్‌ లో ఆడే ఫిల్మ్ అని అర్థమయ్యింది. థియేటర్లలో విడుదల చేయగా, సూపర్‌ హిట్‌ గా నిలిచింది. ఊహించని కలెక్షన్లతో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఇలానే ఇప్పుడు శివాజీ మూవీ కూడా థియేటర్లోకి రాబోతుందట.

శివాజీ నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి. `కోర్ట్` మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. వంద కోట్ల వరకు వెళ్లింది. అలాగే ఇటీవల `దండోరా` కూడా థియేట్రికల్‌గా ఆదరణ పొందింది. ఇప్పుడు ఆయన నటించిన `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` అనే చిత్రాన్ని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో ఓటీటీలోనే తమ మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.

ట్రైలర్‌తో అంచనాలు: థియేటర్లలో దుమ్మురేపేలా ఉందా?

కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారట. చాలా మంది ట్రైలర్‌ చూసి థియేటర్లో ఆడే సినిమా అని చెప్పడంతో థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. ట్రైలర్‌ ఈవెంట్‌లో స్టేజ్ పై కూడా దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్రైలర్‌ బాగుందని, థియేటర్లో రిలీజ్‌ చేయాలని తెలిపారు.  మేకర్స్ ఆ సమయంలో ఓటీటీలోనే రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపారు. కానీ థియేటర్‌లోకి తీసుకురావాలనే డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఈటీవీ విన్‌,  శివాజీ, చిత్ర మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఈ నెల 12న ఓటీటీలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు టాక్‌. వచ్చే నెల(మార్చి) థియేటర్లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

ప్రేమికుల రోజు రిలీజ్ వాయిదా: కొత్త విడుదల ఎప్పుడో?

ఇక శివాజీ, లయ జంటగా నటించిన `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` మూవీకి సుధీర్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో శివాజీ నిర్మాతగా మారారు. ఆయన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై దీన్ని నిర్మించారు. రోహన్‌, ప్రిన్స్, అలీ, ధన్‌ రాజ్‌, ఇమ్మాన్యూయెల్‌ వంటి వారు నటించారు.  రంజిన్‌ రాజ్‌ సంగీతం అందించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఆద్యంతం ఎంగేజ్‌ చేసింది. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఓటీటీ నుంచి ఇది థియేటర్లోకి మారుతున్న నేపథ్యంలో ఓటీటీ అభిమానులకు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పొచ్చు.

శివాజీ గారి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేటర్లలో విడుదల కానుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.