|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘లిటిల్ హార్ట్స్’ హిట్ ఐనా శివానీ స్పీడ్ తగ్గించడానికి అసలు కారణం ఇదేనా?

Published: 13-02-2026, 6:05 AM
షాకింగ్: 'లిటిల్ హార్ట్స్' హిట్ ఐనా శివానీ స్పీడ్ తగ్గించడానికి అసలు కారణం ఇదేనా?
  • శివానీ నాగారం: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ, ప్రేక్షకులను మెప్పించిన నటన!
  • ‘లిటిల్ హార్ట్స్’ మూవీతో ఒక్కరోజే బ్రేక్ ఈవెన్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన శివానీ!
  • హీరో సుహాస్‌తో కలిసి శివానీ నటించిన ‘హే భగవాన్’ మూవీ ఫిబ్రవరి 20న విడుదల!
  • వరుస విజయాలతో దూసుకుపోతున్న శివానీ.. కమర్షియల్ హీరోయిన్‌గా మారడానికి సిద్ధం!

టాలీవుడ్ సెన్సేషన్ శివానీ నాగారం గురించి ఒక సంచలన వార్త! ‘లిటిల్ హార్ట్స్’ హిట్ అయినప్పటికీ, ఆమె వరుసగా సినిమాలు ఎందుకు అంగీకరించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి? తెలుసుకోవడానికి చదవండి!

శివానీ నాగారం సినీ ప్రయాణం ఎలా సాగిందంటే?

గాయని, కూచిపూడి నృత్యకారిణి అయిన శివానీ నాగారం “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. 2024వ సంవత్సరంలో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ మూవీ తర్వాత శివానీ “లిటిల్ హార్ట్స్” సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది.

‘హే భగవాన్’ మూవీ ప్రమోషన్స్‌లో శివానీ కామెంట్స్!

ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె ఒక్కో సినిమాను ఎంచుకుంటూ కెరియర్ను చాలా స్లోగా ముందుకు సాగిస్తుంది. తాజాగా ఈ నటి సుహాస్ హీరోగా రూపొందిన హే భగవాన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీని ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. తాజాగా శివానీ ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంది.

వరుస సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదేనా?

అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ… “2024లో వెండితెరకు పరిచయం అయ్యి మంచి ప్రశంసలను అందుకున్నాను. 2025లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నాను. 2026లో నటిగా పూర్తి కమర్షియల్ హీరోయిన్గా మారిపోయాను. ఇలా మూడు సంవత్సరాలు నా కెరియర్ బాగా ముందుకు సాగింది. నేను వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు. నేను చేసే సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా అందులో విజయాల సంఖ్య ఎక్కువగా ఉండాలనే దృష్టితోనే నా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాను. తాజాగా నేను నటించిన హే భగవాన్ సినిమా కూడా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని” శివానీ చెప్పుకొచ్చింది.

శివానీ నాగారం కెరీర్ ప్రస్తుతం ఊపందుకుంది. ఆమె నటిగా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ‘హే భగవాన్’ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.