
📌 Key Points
- శివాని నగరం: ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్!
- బ్రహ్మోత్సవాల సమయంలో శివానికి 15 నిమిషాలపాటు ప్రత్యేక దర్శనం లభించింది!
- దేవుడితో స్నేహితురాలిగా మాట్లాడానని తెలిపిన శివాని నగరం – వైరల్ అవుతున్న కామెంట్స్!
- టీటీడీ అధికారులను ప్రశ్నిస్తున్న నెటిజన్లు – సామాన్యులకు సెకన్లు కూడా దొరకడం కష్టమని విమర్శలు!
టాలీవుడ్ హీరోయిన్ శివాని నగరం గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది! ఆమె తిరుమలలో ఏకంగా 15 నిమిషాలు దర్శనం చేసుకున్నారట. దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం!
15 నిమిషాలు దర్శనం.. ఎలా సాధ్యం?
Shivani Nagaram : తిరుమలలో ఒక 10 సెకండ్స్ స్వామి దర్శనం దొరకడమే కష్టం సామాన్య భక్తులకు. సెలబ్రిటీలకు అయినా VIP బ్రేక్ సమయంలో మహా అయితే ఒక నిమిషం దర్శనం టైం దొరుకుతుందేమో కానీ ఈ హీరోయిన్ కి 15 నిముషాలు దర్శనం అయిందని చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.(Shivani Nagaram)
వరుసగా మూడు సినిమాలతో హిట్స్ కొట్టి దూసుకుపోతుంది శివాని నగరం. తాజాగా తన హే బల్‌వంత్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లిటిల్ హార్ట్స్ సక్సెస్ తర్వాత తిరుమలకు వెళ్లిన సంఘటన గురించి తెలిపింది.
దేవుడితో స్నేహితురాలిగా మాట్లాడాను
శివాని నగరం మాట్లాడుతూ.. చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు నేను చాలా ఫేమస్ అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని కోరుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు తిరుపతి వెళ్దాం అనుకున్నా కుదర్లేదు. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చేది. మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత వెళ్ళాను. నాకు ఇచ్చినవాటన్నిటికి థ్యాంక్స్ చెప్పాను దేవుడికి. దేవుడితో ఫ్రెండ్ లాగా మాట్లాడా. నేను వెళ్ళింది బ్రహ్మోత్సవాలు సమయంలో. ఆ సమయంలో దర్శనం చాలా కష్టం. కానీ లిటిల్ హార్ట్స్ తర్వాత కావడంతో తిరుమలకి వెళ్ళినప్పుడు కొంచెం సేపు ద్వారం దగ్గర నిల్చోబెడతాం అని చెప్పారు.
15 నిమిషాల పాటు నన్ను ఎవరూ కదల్పలేదు, నా మీద చెయ్యి వేసి జరగమనలేదు. ఓ పక్కన గోవిందా గోవిందా అంటుంటే కొంతమంది నన్ను చూసి కాత్యాయనీ భోంచేసావా అని అంటున్నారు. ఇంక నాకు ఏం వద్దు ఇది చాలు లైఫ్ లో అనిపించింది. మా అమ్మ కూడా వచ్చింది నాతో. మా అమ్మ థ్యాంక్స్ బేటా నీ వల్ల 15 నిముషాలు దర్శనం చేసుకున్నా. నీ తల్లి అయినందుకు గర్వపడుతున్నా అంది. నాకు ఇంకా ఏం వద్దు రా బాబూ అనిపించింది. స్వామి వారికీ వేసిన వస్త్రాలు పక్కన వేరే చోట దాస్తారు. అక్కడికి తీసుకెళ్లి ఓ వస్త్రం నా ఫేస్ కి అంటించారు. ఆ వాసన ఒక మంచి ఫీల్ వచ్చింది. నేను ఉన్నా నీకు అని దేవుడు చెప్పినట్టు అనిపించింది. అది చాలా స్పెషల్ ఫీల్. షిరిడిలో కూడా అరగంట సేపు నిల్చున్నా హారతి సమయంలో. నన్ను గుర్తుకుపెట్టి ముందుకు తీసుకెళ్లారు అని తెలిపింది.
వైరల్ అవుతున్న శివాని కామెంట్స్
దీంతో శివాని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అసలు సెకండ్స్ టైం కూడా సామాన్య భక్తులకు ఇవ్వరు. అలాంటిది హీరోయిన్ కి 15 నిముషాలు ఎలా ఇచ్చారు అంటూ పలువురు టీటీడీ ని ప్రశ్నిస్తూ పోస్టులు చేస్తున్నారు.
శివాని నగరం తిరుమల దర్శనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


