|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆకలికి ఆగలేక భోజనానికి కూర్చుంటే లేపేశారు.. బాధతో వచ్చేశాను.. మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శివారెడ్డి కామెంట్స్

Published: 14-08-2025, 8:41 PM
ఆకలికి ఆగలేక భోజనానికి కూర్చుంటే లేపేశారు.. బాధతో వచ్చేశాను.. మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శివారెడ్డి కామెంట్స్

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు కమెడియన్ శివారెడ్డి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కున్న కష్టాల గురించి ఒక ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించారు. ఆయన భోజనం చేస్తుండగా లేపబడ్డారని, ఆ బాధతో తన అనుభవాన్ని పంచుకున్నారు.

Key Points

1

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కున్న కష్టాలను వెల్లడించారు.

2

సినిమా షూటింగ్‌లో ఆకలితో ఉన్నప్పటికీ భోజనం చేస్తుండగా లేపబడ్డారు.

4

నంది అవార్డు గ్రహీత శివారెడ్డి మహేష్ బాబు 'దూకుడు' సినిమాలో నాగార్జున వాయిస్ చేశారు.

శివారెడ్డి కెరీర్ ప్రారంభం

తెలుగులో అతి తక్కువ మంది గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్‌ల్లో శివారెడ్డి ఒకరు. సినిమాల్లోకి రాకముందు పలు స్టేజీ షోలలో తన మిమిక్రీతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించి విపరీతమైన క్రేజ్‌తోపాటు ప్రశంసలు అందుకున్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ , వైఎస్ రాజశేఖర్ రెడ్డి , తదితర రాజకీయ ప్రముఖుల వాయిస్‌లను పర్ఫెక్ట్‌గా అనుకరించి మంచి పేరు తెచ్చుకున్నారు.

మిమిక్రీ ఆర్టిస్ట్‌గానే కాకుండా జెమినీ టీవీలో జల్సా, కోటేశ్వర రావు, జీ తెలుగు లో చిత్తం చిత్తం ప్రాయిశ్చిత్తం, మాటీవీలో ఘర్షణ డ్యాన్స్ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన శివారెడ్డి జెమినీ ఛానెల్‌లోని జూలకటకకు న్యాయ నిర్ణేతగా చేశారు. అనేక న్యూస్ ఛానెల్స్‌లో మిమిక్రీతో హాస్యం పండించిన శివారెడ్డి ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా మెప్పించారు.

ముఖ్యంగా ఆనందం సినిమాలో పర్స్ మర్చిపోయా డైలాగ్‌తో ఎంతోమందికి గుర్తుండిపోయారు శివారెడ్డి. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసిన శివారెడ్డికి అతడే ఒక సైన్యం సినిమాతో మళ్లీ పాపులారిటీ వచ్చింది. ఇక మహేశ్ బాబు దూకుడు సినిమాలో నాగార్జున వాయిస్‌ చేసి అలరించారు శివారెడ్డి.

భోజన సమయంలో జరిగిన సంఘటన

నంది అవార్డ్ సైతం అందుకున్న శివారెడ్డిని ఒకానొక సమయంలో భోజనానికి కూర్చుంటే లేపేసినట్లు చెప్పారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివారెడ్డి తన కెరీర్ తొలినాళ్లలో పరిస్థితిని చెప్పారు. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో శివారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“సినిమా పేరెందుకు గానీ ఓపెనింగ్. ఆ సినిమా ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ తర్వాత కంటిన్యూగా షూటింగ్ జరుగుతుంది. అంటే, అవకాశం కోసం వెళ్లాను. మధ్యాహ్నాం భోజనాలు పెడుతున్నారు. అందరూ కూర్చున్నారు. నేను కూడా కూర్చున్నాను” అని శివారెడ్డి తెలిపారు.

“అతికష్టం మీద.. ఇంక ఆకలికి తట్టుకోలేక.. అంటే పొద్దున్నుంచి టిఫిన్ చేయలేదు. అందులోనూ లిఫ్ట్ అడుక్కుంటూ లిఫ్ట్ అడుక్కుంటూ వచ్చాను. ఎండకాలం. కొంతదూరం నడిచి, కొంతదూరం లిఫ్ట్ అడక్కుని వచ్చాను. భోజనానికి కూర్చుంటే ప్రొడక్షన్ అతను లేపేసారండి” అని శివారెడ్డి చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్

“ఎవరు నువ్వు” అని అంటే “ఆర్టిస్ట్‌ను” అని చెప్పాను. “ఇచ్చారా క్యారెక్టరు ఇందులో” అని అడిగాడు. వాళ్లకు అర్థమైపోతుందిగా అండి. ఫైలు, అందులో ఫొటోలు, తెలిసిపోతుంది. ఎవరు నువ్వు అనేసరికి ఆర్టిస్ట్‌ గా ట్రై చేస్తున్నానండి అన్నా. ఇచ్చారా అవకాశం అంటే.. లేదు అన్నా. అయితే తర్వాత కూర్చోండి, లేవండి. తర్వాత కూర్చోండి అంటే అర్థమైపోయి అక్కడి నుంచి బాధతో వచ్చేశాను” అని శివారెడ్డి చెప్పుకొచ్చారు.

“అన్నం పెట్టలేదు ఆరోజు” అని యాంకర్ అడిగితే.. “లేదండి” అని శివారెడ్డి తెలిపారు. ఇలా కెరీర్ స్టార్టింగ్‌తో తనకు జరిగిన అవమానాన్ని చెప్పారు కమెడియన్ శివారెడ్డి.

శివారెడ్డి కష్టాలను, ఆయన సాధించిన విజయాలను ఈ సంఘటన తెలియజేస్తుంది. ఆయన సినిమా రంగంలో చేసిన కృషికి గుర్తింపు లభించడం సంతోషకరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.