|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Soundarya: సౌందర్య తన కెరీర్‌లో కష్టంగా ఫీలైన మూవీ ఏంటో తెలుసా? ఏకంగా తండ్రికి డెడికేట్‌

Published: 14-06-2025, 8:35 AM
Soundarya: సౌందర్య తన కెరీర్‌లో కష్టంగా ఫీలైన మూవీ ఏంటో తెలుసా? ఏకంగా తండ్రికి డెడికేట్‌

ప్రముఖ తెలుగు సినిమా నటి సౌందర్య తన సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది. అయితే, ఆమె తనకు అత్యంత కష్టతరమైన సినిమాగా ‘అమ్మోరు’ని గుర్తుంచుకుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆమెకు ఎంతో సవాలు విసిరాయని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

Key Points

1

సౌందర్య తన కెరీర్ లో అత్యంత కష్టతరమైన సినిమా 'అమ్మోరు'.

2

ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్లు చేయడం ఆమెకు చాలా కష్టమనిపించింది.

4

'అమ్మోరు' సినిమా ఆమె నటన జీవితంలో ఒక మలుపు తిప్పిందని ఆమె అభిప్రాయం.

సౌందర్య కెరీర్‌లో ‘అమ్మోరు’ సినిమా ప్రత్యేకత

సౌందర్య సహజ నటిగా తెలుగు తెరని శాసించింది. దాదాపు 15ఏళ్లపాటు ఆమె తిరుగులేని స్టార్‌గా రాణించింది. కానీ అనుకోని ప్రమాదంలో కన్నుమూసింది. 2004లో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

ఆమె మరణించినా తన సినిమాలతో జీవించే ఉంది. ఇప్పటికీ ఇండియన్‌ ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. అయితే సౌందర్య కెరీర్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ నటించింది. కానీ తెలుగు ఆమెకి లైఫ్‌ ఇచ్చింది. అందులోనూ ఒక సినిమాని తనకు ఫేవరేట్‌గా చెబుతుంది సౌందర్య.

సౌందర్య ఎలాంటి పాత్ర అయినా ఈజీగా చేస్తుంది. ఆ పాత్రలో జీవించేస్తుంది. కానీ ఒక మూవీ విషయంలో మాత్రం బాగా ఇబ్బంది పడిందట. చాలా కష్టపడాల్సి వచ్చిందట. కొన్ని సీన్లు చేసేటప్పుడు చాలా స్ట్రగుల్‌ అయ్యిందట. దీంతో ఎంతో సవాల్‌గా తీసుకుని ఆ మూవీ చేయాల్సి వచ్చిందట.

మరి సౌందర్య చెప్పిన ఆ మూవీ ఏంటనేది చూస్తే, అదే `అమ్మోరు`. సౌందర్య నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ. కెరీర్‌ బిగినింగ్‌లోనే ఈ చిత్రం చేసింది సౌందర్య. ఇందులో ఆమె భవానీ పాత్రలో నటించింది.

‘అమ్మోరు’ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు

ఈ పాత్ర కష్టంగా అనిపించడానికి అప్పటి వరకు తనకు పెద్దగా అనుభవం లేకపోవడం ఓ కారణమైతే, అది చాలా సంఘర్షణతో కూడిన పాత్ర కావడం మరో కారణం. అయినా తాను ఇలాంటి పాత్రలు కూడా చేయగలను అని నిరూపించుకోవాలని, ఇండస్ట్రీకి చాటి చెప్పాలని భావించి సౌందర్య ఎంతో ఛాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమాలో నటించిందట.

పైగా తనని ఏరికోరి వచ్చిన ఆఫర్‌ ఇది. అందుకే ఏమాత్రం తగ్గకూడదని భావించిందట సౌందర్య. ఎంతో కష్టపడి చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన లైఫ్‌ని మార్చిన మూవీ `అమ్మోరు` అని, ఆ తర్వాత నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు వచ్చాయని చెప్పింది.

అయితే ఇందులో క్లైమాక్స్ సీన్లు చేయడానికి మరింత ఇబ్బంది పడిందట. సినిమా చాలా ఎమోషనల్‌ డ్రామా. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ ఇలాంటి ఎమోషనల్‌ క్యారెక్టర్ చేశానని, క్లైమాక్స్ పోర్షన్‌ చెప్పినప్పుడు భయంగా అనిపించిందట. చేతిలో నిప్పుపట్టుకుని ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతూ అమ్మోరు ముందు హారతి ఇస్తూ చేయడం చాలా టఫ్‌గా అనిపించిందని తెలిపింది సౌందర్య.

సౌందర్య ఇంకా చెబుతూ, `అమ్మోరు చిత్రంలో ప్రతి షాట్‌ టెస్ట్ లా ఉండేది. అందులో ఫోన్‌ ఎపిసోడ్‌ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ సీన్‌లో తన భర్త ఫారెన్‌ నుంచి ఫోన్‌ చేస్తుంటారు, కానీ ఇక్కడ(ఫ్యామిలీ మెంబర్స్) ఆ ఫోన్‌ ఇవ్వరు. టార్చర్‌ చేస్తుంటారు. ఆ సీన్‌ చేస్తుంటే కూడా చాలా కష్టంగా అనిపించింది` అని తెలిపింది.

సినిమా సౌందర్య నటన జీవితంపై ప్రభావం

ఇలా తన జీవితంలో `అమ్మోరు` చిత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని, ఇలాంటి ఆఫర్‌ చేసిన నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపింది సౌందర్య. ఆ సినిమా చేయడం వల్లే తాను ఇంత కాలం సర్వైవ్‌ కాగలిగాను అని, నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు వచ్చాయని తెలిపింది సౌందర్య. అంతటితో ఆగలేదు. ఈ చిత్రాన్ని తన తండ్రికి అంకితం చేస్తున్నట్టు తెలిపింది.

కన్నడకి చెందిన సౌందర్య 1993లో `మనవరాలి పెళ్లి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు, కానీ ఫర్వాలేదనిపించింది. ఎంట్రీ ఇచ్చిన ఏడాదినే తొమ్మిది సినిమాలు చేసింది. `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు` చిత్రాలతో విజయాలు అందుకుని గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత నాగార్జునతో చేసిన `హలో బ్రదర్‌` మూవీ ఆమెకి బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే నిజానికి తెలుగులో సౌందర్య ఫస్ట్ కమిట్‌ అయిన మూవీ `రైతు భారతం`.  నిర్మాత త్రిపురనేని మహారథి దీన్ని రూపొందించారు.

కానీ ఈ చిత్రం రెండేళ్ల తర్వాత విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ నాటికి ఆమె నటించిన 16 సినిమాలు విడుదలయ్యాయి. అప్పటికే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది సౌందర్య. ఇక ప్రారంభంలో సైన్‌ చేసిన `అమ్మోరు` మూవీ మూడేళ్ల తర్వాత విడుదలైంది.

చివరగా, ‘అమ్మోరు’ సినిమా సౌందర్య నటన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా ఆమె తన నటన ప్రతిభను చాటుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.