|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Shobana: చెట్టు వెనకాల డ్రెస్‌ మార్చుకోమని చులకనగా.. బిగ్‌బీ ఎంటరై..

Published: 08-06-2025, 3:42 AM
Shobana: చెట్టు వెనకాల డ్రెస్‌ మార్చుకోమని చులకనగా.. బిగ్‌బీ ఎంటరై..

మలయాళ సీనియర్ నటి శోభన తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఉన్న తన అనుభవాలను పంచుకుంది. ఒక షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను ఆమె వివరించింది.

Key Points

1

శోభన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఉన్న అనుభవాలను పంచుకుంది.

2

అహ్మదాబాద్‌లోని షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటనను వివరించింది.

4

అమితాబ్ బచ్చన్‌ ఆమెను తన కారవాన్‌లోకి తీసుకెళ్లి, గౌరవంగా ప్రవర్తించారు.

శోభన ఇన్‌స్టాగ్రామ్ లైవ్

మలయాళ సీనియర్‌ హీరోయిన్‌ శోభన ( Shobana ) ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ( Kalki 2898 AD Movie )తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్‌ సినిమాలోనూ యాక్ట్‌ చేసింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.

అమితాబ్‌తో పాట షూటింగ్‌ బచ్చన్‌ సర్‌ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్‌ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్‌ ( Amitabh Bachchan ) సర్‌ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్‌లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్‌లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్‌ సర్‌ దగ్గర కారవాన్‌ ఉంది. కానీ చాలామంది షూట్‌ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.

అమితాబ్ బచ్చన్‌తో అనుభవాలు

చెట్టు వెనకాల.. నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్‌ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్‌ చేశారు. బచ్చన్‌ సర్‌ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్‌లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.

కల్కి 2898 ఏడీలో.. కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్‌ (హెవీ మేకప్‌) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించాడు. అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్‌ హాసన్‌ యాస్కిన్‌గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో పట్టాలెక్కనుంది.

అహ్మదాబాద్ షూటింగ్ ఘటన

అమితాబ్ బచ్చన్‌ చూపించిన గౌరవం, వినయం శోభనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఘటన సినీ పరిశ్రమలోని గొప్ప వ్యక్తుల మధ్య ఉన్న గౌరవం, సహకారం గురించి తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.