
కార్తీక దీపం, బిగ్ బాస్ షోలతో పాపులర్ అయిన నటి శోభా శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రయాణాన్ని వివరించింది. ఆమె మొదటి ఆడిషన్‌కు పాస్‌పోర్ట్ ఫోటోలు తీసుకెళ్లిన విషయం ఆమె చెప్పుకొచ్చింది.
Key Points
శోభా శెట్టి తన మొదటి ఆడిషన్‌కు పాస్‌పోర్ట్ ఫోటోలు తీసుకెళ్లింది.
కన్నడ సీరియల్‌లో హీరోయిన్‌గా తన మొదటి అవకాశం దక్కించుకుంది.
కాలేజీలో చదువుతున్నప్పుడు డైరెక్టర్ దృష్టిలో పడింది.
శోభా శెట్టి ఇండస్ట్రీలో ప్రయాణం
Shobha Shetty : కార్తీక దీపం, బిగ్ బాస్ ఫేమ్ నటి శోభా శెట్టి ప్రస్తుతం కన్నడలో సీరియల్, తెలుగులో పలు షోలు చేస్తూ బిజీగానే ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో చెప్పింది.
మొదటి ఆడిషన్ అనుభవం
శోభా శెట్టి తన ప్రయాణం గురించి చెప్తూ.. నేను ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదాన్ని. కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీలో ఓ ఈవెంట్ జరిగేటప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి నన్ను చూసారు. నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. నన్ను చూసి సీరియల్స్ లో ట్రై చేయొచ్చు కదా అన్నారు. తన మేనేజర్ నా నంబర్ తీసుకున్నారు. తర్వాత కాల్ చేసి ఆడిషన్ కి రమ్మన్నారు. మా అమ్మకి చెప్తే వెల్దాము, ట్రై చేద్దాం అన్నారు. ఫొటోలు తీసుకొని రమ్మంటే కాలేజీ పాస్ పోర్ట్ ఫొటోలు తీసుకెళ్ళాను, అవి చూసి నవ్వారు. మాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం అన్నాను. తర్వాత వాళ్ళే పిలిచి ఫోటోషూట్ చేసారు. కన్నడ సీరియల్ లో ఏకంగా హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. అప్పుడు రోజుకు 750 రూపాయలు ఇచ్చారు అని తెలిపింది.
మొదటి రెమ్యునరేషన్
తన ప్రయాణాన్ని శోభా శెట్టి చాలా సరదాగా, ఆసక్తికరంగా వివరించింది. కష్టపడి పనిచేసి ఈ స్థాయికి ఎదిగినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసింది.


