|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Shobha Shetty : తన లవ్ స్టోరీ గురించి చెప్పిన బిగ్ బాస్ భామ.. పెళ్లి ఎప్పుడంటే? ఒప్పుకోకపోతే అతని వెనక తిరిగా..

Published: 26-07-2025, 11:54 PM
Shobha Shetty : తన లవ్ స్టోరీ గురించి చెప్పిన బిగ్ బాస్ భామ.. పెళ్లి ఎప్పుడంటే? ఒప్పుకోకపోతే అతని వెనక తిరిగా..

కన్నడ, తెలుగు సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్న శోభా శెట్టి, బిగ్ బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. తన ప్రేమ జీవితం గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Key Points

1

బిగ్ బాస్ భామ శోభా శెట్టి తన ప్రేమకథను వెల్లడించింది.

2

యశ్వంత్‌తో 5 ఏళ్ల ప్రేమాయణం తర్వాత నిశ్చితార్థం.

4

అమ్మ ఆరోగ్యం కారణంగా పెళ్లి వాయిదా.

శోభా శెట్టి ప్రేమకథ

Shobha Shetty : కన్నడ భామ శోభా శెట్టి కన్నడ, తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకోగా తెలుగులో కార్తీక దీపం సీరియల్ లో మోనిత అనే నెగిటివ్ పాత్రలో బాగా ఫేమ్ తెచ్చుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని మరింత వైరల్ అయింది. శోభా శెట్టి ఆల్రెడీ యశ్వంత్ అనే సీరియల్ నటుడ్ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది.

తాజాగా శోభా శెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.

యశ్వంత్‌తో నిశ్చితార్థం

శోభా శెట్టి మాట్లాడుతూ.. నా అన్ని సమస్యలు తీరిపోయి సెటిల్ అయ్యాను. కష్టాలు అయిపోయాయి అనుకున్నాక ఇంట్లో పెళ్ళిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నేను రాఘవేంద్ర స్వామిని బాగా నమ్ముతాను. సంబంధాలు చూడటం మొదలుపెట్టాక మంత్రాలయం వెళ్లి దండం పెట్టుకున్నా. నువ్వు ఎవర్ని చూపిస్తే వాళ్లనే చేసుకుంటాను అని రాఘవేంద్ర స్వామికి చెప్పాను. అక్కడి నుంచి వచ్చాక ఓ 20 రోజుల గ్యాప్ లో షూటింగ్ షెడ్యూల్ లో యశ్వంత్ ని క్యాజువల్ గా చూసా. అతను కూడా చూసాడు. అలా రెండు మూడు సార్లు చూసుకున్నాం. అప్పటికే చాలా రోజుల నుంచి కలిసి పనిచేస్తున్నాం కానీ స్పెషల్ ఏమి లేదు. ఆ రోజు చూసాక నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేసాడు ఎందుకు చూసావు అని. అలా మాట్లాడటం మొదలయి ప్రేమలో పడ్డాను.

పెళ్లి ఎప్పుడు?

యశ్వంత్ ని దేవుడే ఇచ్చాడని నమ్మాను. 5 ఏళ్ళు లవ్ మాది. నేనే మొదట ప్రపోజ్ చేశా. అతను ఒప్పుకోలేదు. లైఫ్ లో సెటిల్ అవ్వలేదని, ఇంకా ఏవో కారణాలు చెప్పి నా ప్రేమని ఒప్పుకోలేదు. కానీ నేను అతని వెనక తిరిగా. కొన్నాళ్ళకు ఒప్పుకున్నాడు. మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్ లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ మా అమ్మకు హెల్త్ బాగోలేదు. మా అమ్మకు నా పెళ్లి గ్రాండ్ గా చేయాలని కల. మా అమ్మ హెల్త్ సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాము. ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ మొదట్లో చేసుకుంటాము అని తెలిపింది.

అమ్మ ఆరోగ్యం మెరుగైన తర్వాతే పెళ్లి చేసుకుంటామని శోభా శెట్టి తెలిపింది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి జరగనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.