|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ట్యాగ్ చేస్తే చంపేస్తారా? శోభిత ‘చీకటిలో’ ట్రైలర్ రిలీజ్.. వైరల్!

Published: 12-01-2026, 4:00 AM
షాకింగ్: ట్యాగ్ చేస్తే చంపేస్తారా? శోభిత 'చీకటిలో' ట్రైలర్ రిలీజ్.. వైరల్!
  • శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ మూవీ ట్రైలర్ విడుదల: ఉత్కంఠ రేపుతున్న సీరియల్ కిల్లర్ కథ!
  • న్యూస్ యాంకర్‌గా శోభిత: స్నేహితుల హత్యల వెనుక మిస్టరీ ఛేదించేందుకు సొంత ఛానెల్!
  • ట్యాగ్ చేస్తే చంపేస్తారా? సోషల్ మీడియా నేరాల నేపథ్యంలో ‘చీకటిలో’ మూవీ!
  • జనవరి 23 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ‘చీకటిలో’ స్ట్రీమింగ్: తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో!

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక సంచలన వార్త! శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన ‘చీకటిలో’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

సొంత ఛానెల్‌తో శోభిత దూకుడు

స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఈ చిన్నది చేయబోతున్న ఫస్ట్ మూవీ ‘చీకటిలో’. అయితే ఈ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌ను గమనించినట్లయితే.. న్యూస్ ఛానల్ యాంకర్ జాబ్ మానేసి సొంతంగా ఛానల్ పెట్టి ఫ్రెండ్స్ హత్యల వెనుక ఉన్న కారణాన్ని కనిపెట్టే సంధ్య పాత్రలో శోభిత కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సినిమా టైటిల్‌కి తగ్గట్టే సేమ్ చీకటిలో ఓ సీరియల్ కిల్లర్ మర్డర్స్‌ చేస్తూ ఉంటాడు. అప్పుడు అసలు అతను అందరినీ చంపడానికి గల కారణం ఏమై ఉంటుందని శోభిత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ టైమ్‌లో ‘ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు’ అనే చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్ అయింది. ఇక చివరగా సోషల్ మీడియా పోస్టులో ట్యాగ్ చేసినందుకే హత్య చేశాడా మరి చీకటిలో క్రియేట్ చేసిన సంధ్యని.. అంటూ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ ట్రైలర్ ఎండ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆసల్యం మీరు కూడా ఈ ట్రైలర్‌ను చూసేయండి.

చీకటిలో సీరియల్ కిల్లర్ కథ

ట్యాగ్ చేస్తే హత్య.. అసలేం జరుగుతోంది?

శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.