
📌 Key Points
- బన్నీవాస్, వంశీ నందిపాటి నిర్మించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ విడుదల సిద్ధం.
- అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బా పటేల్ కథానాయికగా నటించారు.
- ‘ఈషా’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- కథ వినగానే షాక్, ఎగ్జైట్మెంట్ కలిగాయని హీరో అఖిల్ రాజ్ తెలిపారు.
హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ‘ఈషా’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. హీరో అఖిల్ రాజ్ ఈ సినిమా కథ వినగానే ఎంతో షాకింగ్, ఎగ్జైటింగ్ అనుభూతి కలిగిందని తెలిపారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘ఈషా’ చిత్రం: విడుదల వివరాలు, నటీనటులు
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ఓహారర్ థ్రిల్లర్ ‘ఈషా’ (eshaa)చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్(Akhilraj)తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తుండగా.. ఇందులో హెబ్బాపటేల్(Hebba Patel) కథానాయికగా కనిపించనుంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో అఖిల్ రాజ్ మంగళవారం విలేకరులతో మాట్లాడి పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘ఈషా’ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. నేను ఎంతో ఎగ్జైట్ అయ్యాను. తప్పకుండా హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి కొత్త అనుభూతినిస్తుంది.
ఇందులో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ సూపర్భ్‌గా ఉన్నాయి. ఇందులో నేను వినయ్ అనే పాత్రను చేస్తున్నాను. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకర్ని. త్రిగుణ్, సిరి, హెబ్బా పటేల్, మైమ్ మధు వంటి మంచి నటులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రాగా నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ఫలితం ఆశించకుండా కష్టపడాలి. యూనివర్శ్ మనకు కావాల్సిన ఫలితం ఇస్తుందని నా నమ్మకం. కంటెంట్ బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు. నాకు ‘ఈషా’ ఓ గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను’’ అన్నారు.
అఖిల్ రాజ్ ఏమన్నారంటే: షాకింగ్ కథ, ఎగ్జైటింగ్ అనుభవం
హారర్ థ్రిల్లర్‌గా ‘ఈషా’ ప్రత్యేకతలు
మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా ‘ఈషా’ నిలుస్తుందని హీరో అఖిల్ రాజ్ ధీమా వ్యక్తం చేశారు. హారర్ థ్రిల్లర్ ప్రియులకు ఈ సినిమా తప్పకుండా కొత్త అనుభూతినిస్తుందని ఆశిస్తున్నారు. విడుదల తర్వాత చిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.


