
📌 Key Points
- నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది.
- RTC క్రాస్ రోడ్స్‌లో బ్లాక్ టికెట్లు కొని సినిమాలు చూసిన తాను నేడు హీరోగా నిలిచానన్న నవీన్.
- “నా ఎదుగుదలకు మీరే కారణం” అంటూ అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
- నవీన్ పొలిశెట్టి భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
యువ హీరో నవీన్ పొలిశెట్టి తన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తన ఎదుగుదలకు వారే కారణమని నవీన్ పేర్కొన్నారు.
‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి విడుదల
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది.
నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ కామెంట్స్
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. సంక్రాంతి కానుకగా.. జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా నవీన్ పొలిశెట్టి వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఇంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కస్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటదని వాళ్లు డిసైడ్ అయ్యారు.
అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు
అయితే నా లైఫ్‌లో నేను కూడా మీలాగా RTC X Roads లో బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసే వాడిని. కానీ ఈ రోజు నా ఫేవరేట్ ఐడల్స్‌తో పాటు నా సినిమా కూడా ఇప్పుడు సంక్రాంతి కి వస్తుంది. ఈ స్థాయికి రావడానికి కారణం మీరే. నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
నవీన్ పొలిశెట్టి చేసిన ఈ హృదయపూర్వక వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తన గత అనుభవాలను పంచుకుంటూ, తన విజయంలో అభిమానుల పాత్రను గుర్తుచేస్తూ, ఆయన ‘అనగనగా ఒక రాజు’ సినిమాపై అంచనాలను పెంచారు.


