|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ రాజాకి దిమ్మతిరిగే షాక్! నవీన్ పొలిశెట్టి విధ్వంసం.. రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపిన ‘రాజు’!

Published: 15-01-2026, 3:00 AM
మాస్ రాజాకి దిమ్మతిరిగే షాక్! నవీన్ పొలిశెట్టి విధ్వంసం.. రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపిన 'రాజు'!
  • నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు: రికార్డు స్థాయిలో రూ. 22 కోట్లు!
  • రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ మొదటి రోజు కలెక్షన్లు రూ. 5 కోట్లు మాత్రమే!
  • ‘అనగనగా ఒక రాజు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాక్
  • నవీన్, మీనాక్షి చౌదరి జోడీకి ఆడియన్స్ ఫిదా! మారి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణం!

సంక్రాంతి పండుగ వేళ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మాములుగా లేదు. నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ ఊహించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా రవితేజ సినిమాకి షాక్ ఇచ్చింది.

నవీన్ పొలిశెట్టి దూకుడు: రవితేజకి షాక్!

సంక్రాంతి సినిమాలు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నాయి. బాగున్న సినిమా వసూళ్ల వర్షం కురిపించుకుంటోంది. బాలేని చిత్రాలు స్ట్రగుల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ `ది రాజా సాబ్‌` బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. చిరంజీవి మన శంకర వర ప్రసాద్‌ గారు దుమ్ములేపుతుంది. ఆ కోవలోనే ఆద్యంతం అలరిస్తోంది నవీన్‌ పొలిశెట్టి హీరోగా వచ్చిన `అనగనగా ఒక రాజు` మూవీ. ఇది ఊహించని విధంగా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. రవితేజకి మూవీకి పెద్ద షాకిచ్చింది.

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదీ జంటగా నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ గురువారం జనవరి 14న విడుదలైంది. దీనికి మారి దర్శకుడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి ఫీల్‌ని తెచ్చే మూవీ ఇదే అని చెప్పొచ్చు. అన్ని అంశాలను మేళవించి రూపొందించారు. బుధవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే ఫస్ట్ డే ఇది ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది.

‘అనగనగా ఒక రాజు’ మూవీ కలెక్షన్ల సునామీ!

`అనగనగా ఒక రాజు` మూవీ మొదటి రోజు ఏకంగా రూ.22 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని చిత్రం బృందం వెల్లడించింది. ఈ మేరకు కలెక్షన్లతో కూడిన పోస్టర్‌ని విడుదల చేసింది. `రాజుగారు అసలైన సంక్రాంతి సంబరాలు తెచ్చేశారు. ఇంటిళ్లి పాది నవ్వుల సునామీ తెచ్చారు` అంటూ ఈ పోస్టర్‌ని ఇవడుదల చేయడం విశేషం.

ఇదిలా ఉంటే నవీన్‌ పొలిశెట్టి ఇప్పుడు రవితేజకి పెద్ద షాక్‌ ఇచ్చాడని చెప్పొచ్చు. రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ మొదటి రోజు దాదాపు ఐదు కోట్లు వసూలు చేసింది. రెండో రోజు మూడు కోట్లు రాబట్టింది. మొత్తంగా ఎనిమిది కోట్లు చేసింది. ఇప్పుడు కానీ `అనగనగా ఒక రాజు` మూవీ ఒక్క రోజులోనే రూ.22కోట్లు రాబట్టడం విశేషం. ఇది రవితేజ మూవీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ విజయం!

రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి`(బీఎండబ్ల్యూ) మూవీ ఈ సంక్రాంతికి జనవరి 13న విడుదలైంది. దీనికి కిశోర్‌ తిరుమల దర్శకుడు. దీనికి యావరేజ్‌ టాక్‌ వస్తోంది.  ఇది కూడా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయిన మగాడి కథతోనే రూపొందింది. నవ్వులు పూయించడంలో కొంత వరకు సక్సెస్‌ అయ్యింది.

నవీన్ పొలిశెట్టి సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రవితేజ సినిమా వెనుకబడిపోయింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.