|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: శ్రీకాంత్‌తో డాన్స్ చేయను! నమిత పంతం వెనుక అసలు నిజం.. దర్శకుడు షాకింగ్ రివీల్!

Published: 26-05-2026, 6:45 AM
షాకింగ్: శ్రీకాంత్‌తో డాన్స్ చేయను! నమిత పంతం వెనుక అసలు నిజం.. దర్శకుడు షాకింగ్ రివీల్!
  • నమిత, శ్రీకాంత్ డాన్స్ వివాదం హాట్ టాపిక్.
  • “ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి” సెట్‌లో సంచలనం.
  • దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి షాకింగ్ రివీల్స్.
  • నమిత మొండితనం వెనుక అసలు నిజం ఏంటి?

టాలీవుడ్ సంచలనం నమిత గురించి షాకింగ్ నిజం బయటపడింది! ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, శ్రీకాంత్‌తో డాన్స్ చేయడానికి నిరాకరించింది. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాన్ని దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ మాస్ అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది!

నమిత కెరీర్ – షాకింగ్ ఇన్సిడెంట్!

నమిత తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి క్రేజ్‌ పొందింది. మంచి విజయవంతమైన సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఫ్యామిలీ లైఫ్‌కి పరిమితమయ్యింది. అయితే ఒకప్పుడు మాత్రం తెలుగు, తమిళంలో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా చేసింది. వీటితోపాటు కన్నడ, మలయాళంలోనూ కొన్ని సినిమా చేసింది. ప్రస్తుతం రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంది నమిత. ఆమె బీజేపీలో యాక్టివ్ నాయకురాలిగా ఉంది. సొంత వ్యాపారాలతోనూ బిజీగా ఉంది.

నమిత తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైంది. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మూవీ `సొంతం`. ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకుడు. ఈ మూవీతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత వెంకటేష్‌తో `జెమినీ` చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ పెద్దగా ఆడకపోయినా, నమిత మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. అలాగే `ఒక రాజు ఒక రాణి`తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఆమెకి `ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి` అనే చిత్రంలో నటించింది.

శ్రీకాంత్‌తో డాన్స్ చేయనని ఎందుకు చెప్పింది?

జి నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో `ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి` అనే చిత్రం రూపొందింది. ఇందులో శ్రీకాంత్‌, ప్రభుదేవా హీరోలు. డీవీవీ దానయ్య, జే భగవాన్‌ నిర్మాతల. 2003 సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న ఒక సంఘటనని పంచుకున్నారు దర్శకుడు జి నాగేశ్వర్‌ రెడ్డి. `శ్రీరామ చంద్ర సిగ్గే గోవింద` అనే పాట షూటింగ్‌ సమయంలోని నమిత చేసిన పని బయపెట్టాడు దర్శకుడు.

ఈ పాట చిత్రీకరణ సమయంలో ఓ డాన్స్ మూమెంట్‌ని కంపోజ్‌ చేశాడట డాన్స్ మాస్టర్‌. ఇందులో శ్రీకాంత్‌, ప్రభుదేవా ఇద్దరూ డాన్స్ చేస్తారు. ఈ ముగ్గురిపై అదిరిపోయే స్టెప్‌ డిజైన్‌ చేశారట. ఆ డాన్స్ చేసేటప్పుడు నమిత హ్యాండిచ్చిందట. ఆ మూమెంట్‌ చేయనని చెప్పిందట. దర్శకుడు అడిగినా, తాను చేయనంటే చేయనని చెప్పిందట. తాను చూసిన హీరోయిన్లలో చాలా లేజీ హీరోయిన్‌ అని, షాట్‌ కి పిలవగానే వస్తుంది, లేదంటే వెళ్లి కార్వాన్‌ లో పడుకుంటుంది. దేనిపై పెద్దగా ఆసక్తి చూపించదు. ఎవరితోనూ మాట్లాడదని తెలిపారు దర్శకుడు.

దర్శకుడు చెప్పిన అసలు నిజం!

ఈ పాట చేయకపోవడానికి కారణం ఏంటని అడగ్గా, మీరు నన్ను ఇబ్బంది పెట్టడానికే ఈ మూమెంట్‌ కంపోజ్‌ చేశారని అన్నదట, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు అన్నదట. వేరే రకంగా, దానికోసం ఇబ్బంది పెడుతున్నారని చెప్పిందట. తాను అలా ఎందుకు ఇబ్బంది పెడుతానని చెప్పి ఆమెకి నచ్చ చెప్పినా వినలేదట. దీంతో ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ని పిలిపించారట.  అతన్ని పిలిపించి జరిగిన విషయం చెప్పగా, అతను వెళ్లి ఆమెని కన్విన్స్ చేశాడట. ఆ తర్వాత షాట్‌కి తీసుకొచ్చాడట. ఇదంతా పెద్ద రచ్చ అయ్యిందని తెలిపారు నాగేశ్వర్‌రెడ్డి.

బాయ్‌ ఫ్రెండ్‌ ఒప్పించడంతో నమిత ఆ సాంగ్‌ చేయడానికి ఓకే చెప్పింది, కానీ తీరా షూటింగ్‌ చేయడానికి శ్రీకాంత్‌ ఒప్పుకోవడం లేదట. తనతో చేయడానికి నమిత నో చెప్పింది, ఆమెతో నేనెందుకు చేస్తానని శ్రీకాంత్‌ కూర్చున్నాడట. శ్రీకాంత్‌ వాదనలో న్యాయం ఉందని చెప్పి ఆ మూమెంట్‌ని తీసేశారట. ఆ తర్వాత ఎలాగోలా షూట్‌ చేశామని, ఆ తర్వాత పాట బాగా వచ్చిందని, పెద్ద హిట్‌ అయ్యిందని చెప్పారు దర్శకుడు. ఆ సమయంలో సెట్‌లో తాను అరవడమనేది జరిగింది, కానీ అది పెద్దగా కాదు, తాను చెప్పింది చేయకపోతే హర్ట్ అవుతానని, ఎవరిపై అరవనని, కానీ ఆ రోజు కాస్త అరవాల్సి వచ్చిందని చెప్పారు దర్శకుడు.

నమిత కెరీర్‌లో ఈ సంఘటన ఒక సంచలనం. దర్శకుడు బయటపెట్టిన ఈ నిజాలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీశాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.