
📌 Key Points
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కోసం రూ. 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారు.
- మాళవిక మోహనన్ రూ. 2 కోట్లు, నిధి అగర్వాల్ రూ. 1.2-1.5 కోట్లు తీసుకున్నారు.
- సంజయ్ దత్ రూ. 5-6 కోట్లు, రిద్ధి కుమార్ రూ. 3 కోట్లు పారితోషికం పొందారు.
- డైరెక్టర్ మారుతికి రూ. 18 కోట్లు, బ్రహ్మానందం రూ. 80 లక్షలు, అనుపమ్ ఖేర్‌కు రూ. 1 కోటి దక్కాయి.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు బయటపడ్డాయి. ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, డైరెక్టర్ మారుతి వంటి వారు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రభాస్ రెమ్యూనరేషన్: ఆశ్చర్యపరిచే ఫిగర్స్
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) త్వరలోనే ది రాజా సాబ్ (The Raja Saab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది.
ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు తీసుకున్న రెమ్యూనరేషన్లకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలో నటించిన ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ వంటి తదితరులు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయానికి వస్తే..
ప్రభాస్ : పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు కానీ రాజా సాబ్ సినిమా కోసం ఈయన కేవలం 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది.
హీరోయిన్ల పారితోషికాలు: ఎవరు ఎంత తీసుకున్నారు?
మాళవిక మోహనన్ : ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న వారిలో ఒకరైన మాళవిక మోహనన్ మొదటిసారి ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించినందుకు ఈమెకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందించినట్టు తెలుస్తుంది.
నిధి అగర్వాల్ : ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ 1.2- 1.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.
రిద్ధి కుమార్: రాజా సాబ్ సినిమాలో మరో హీరోయిన్ రిద్ది కుమార్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కోసం ఈమె ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.
కీలక పాత్రల నటులు, డైరెక్టర్ జీతం వివరాలు
సంజయ్ దత్: ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 5- 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నారు. అందుకుగాను ఈయన 80 లక్షలు, మరో నటుడు అనుపమ ఖేర్ ఒక కోటి, డైరెక్టర్ మారుతి 18 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా హార్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘ది రాజా సాబ్’ నటీనటులు, డైరెక్టర్ అందుకున్న భారీ పారితోషికాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రెమ్యూనరేషన్లు సినిమా బడ్జెట్‌లో కీలక పాత్ర పోషించాయని స్పష్టమవుతోంది. ఈ వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.


