|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్ హీరోతో శ్రీలీల నిశ్చితార్థం ? ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫొటోస్.. బిగ్ డే అంటూ హింట్

Published: 31-05-2025, 1:10 AM
స్టార్ హీరోతో శ్రీలీల నిశ్చితార్థం ? ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫొటోస్.. బిగ్ డే అంటూ హింట్

టాలీవుడ్ నటి శ్రీలీల తన తాజా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సంప్రదాయ వేడుక వాతావరణంలో ఉన్న ఆ ఫొటోలు ‘బిగ్ డే’ అనే హింట్ తో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలతో కార్తీక్ ఆర్యన్ తో ఆమె నిశ్చితార్థం జరిగిందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీలీల తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ, ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించడంతో అభిమానుల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఫోటోలలో ఆమె ముఖంపై హల్దీతో కనిపిస్తున్నారు. చుట్టూ కుటుంబ సభ్యులు సందడిగా కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పెళ్లి తంతులా అనిపిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసిన ఫొటోలలో శ్రీలీల ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమె చెంపలపై పసుపు పూసి ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా సాధారణంగా నిశ్చితార్థం, పెళ్లి వేడుకల్లో జరుగుతుంది. దీనితో శ్రీలీల నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగిందా ? ఆమె పెళ్ళికి రెడీ అవుతోందా ? అనే అనుమానాలు నెటిజన్లలో మొదలయ్యాయి.

శ్రీలీల ఇచ్చిన ‘బిగ్ డే’ హింట్

శ్రీలీల కూడా అందుకు తగ్గట్లుగా హింట్స్ ఇచ్చింది. ఇది నాకు బిగ్ డే.. కమింగ్ సూన్ అని పోస్ట్ చేసింది. దీనితో శ్రీలీల నిశ్చితార్థం పూర్తయింది అని ఇప్పుడు పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తోంది అని నెటిజన్లు అంటున్నారు.

ఈ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల కొంత కాలంగా శ్రీలీల, బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఓ సినిమా భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం పేరు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు కానీ, చాలా మంది ఇది అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆషికీ 3’ అని భావిస్తున్నారు.

కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ రూమర్స్

శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ నిశ్చితార్థం సైలెంట్ గా జరిగిపోయింది అని కొందరు భావిస్తున్నారు. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్ మొదలయ్యాక.. ఒక సందర్భంలో కార్తీక్ ఆర్యన్ తల్లి.. మా ఇంటికి కోడలు రాబోతోంది అని హింట్ ఇచ్చారు. అయితే శ్రీలీల ఎంగేజ్మెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అది ఎంగేజ్మెంట్ కాదని, యాడ్ షూట్ అయి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. అయితే దేనిపైనా శ్రీలీల అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అందరినీ కన్ఫ్యూజన్ లో నెట్టేలా పోస్ట్ పెట్టింది.

శ్రీలీల ఇచ్చిన హింట్స్ మరియు వైరల్ అవుతున్న ఫొటోలతో ఆమె నిశ్చితార్థం గురించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, అధికారిక ప్రకటన కోసం ఇంకా ఎదురుచూడాల్సి ఉంది.

Related News

గుండె నిండా గుడి గంటలు: అరుణ్ షాకింగ్ తప్పులు! బాలు సవాల్.. మీనాకు ఊహించని సపోర్ట్!
"కార్తీక దీపం 2": పారిజాతం ప్లాన్ అట్టర్ ఫ్లాప్! కార్తీక్, దీప మాస్ ఎంట్రీతో షాక్!
షాకింగ్ న్యూస్: లవర్, బెస్ట్ ఫ్రెండ్ చేసిన ద్రోహం.. పెళ్లి చేసుకోని బుల్లితెర స్టార్ హీరో హర్షద్ కన్నీటి కథ వైరల్!
రవితేజ మాస్ ప్లాన్! 'ఇరుముడి'లో అయ్యప్ప పూనకాలు... మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ అప్డేట్!
బిగ్ బ్రేకింగ్! వైరల్ స్టార్ కపుల్: షర్మిల మాండ్రే ఎంగేజ్‌మెంట్! నిర్మాత సుధన్‌తో పీటలెక్కనున్న హీరోయిన్! ఫొటోలు మంటలు.
కావ్య-అనిరుధ్ పెళ్లిపై బాబాయ్ మహేంద్రన్ షాకింగ్ క్లారిటీ! నిజంగానే కన్ఫర్మ్ అయ్యిందా?
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.