
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్లు ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. మొన్న అదితీ రావు హైదరీ, ఇప్పుడు శ్రియ సరన్ తమ పేరుతో వాట్సాప్‌లో మోసం జరుగుతుందని బయటపెట్టి, అందరినీ అప్రమత్తం చేశారు.
Key Points
శ్రియ సరన్ పేరుతో వాట్సాప్‌లో మోసం జరుగుతున్నట్లు హెచ్చరించింది.
ఫేక్ అకౌంట్ ద్వారా సెలబ్రిటీలకు సందేశాలు పంపుతున్నారని తెలిపింది.
ఇదే తరహా మోసం గతంలో అదితీ రావు హైదరీకి కూడా జరిగింది.
అభిమానులు, ఇండస్ట్రీ వారు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
శ్రియ పేరుతో వాట్సాప్ మోసం వెల్లడి
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధం కావట్లేదు. ఎందుకంటే మన పేరుని, ఫోన్ నంబర్లని ఎంతలా మోసాలకు ఉపయోగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఓ స్కామ్ బారిన పడుతున్నారు. రెండు రోజుల క్రితమే హీరోయిన్ అదితీ రావు హైదరీ తన పేరుతో వాట్సాప్‌లో మోసం జరుగుతుందని బయటపెట్టగా.. ఇప్పుడు ఇదే తరహాలో తన పేరుతోనూ జరుగుతోందని శ్రియ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
బుధవారం ఉదయం శ్రియ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ తన ఫొటోతో ఉన్న ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. ఇది తన నంబర్ కాదని, తన పేరుతో సెలబ్రిటీలకు మెసేజ్ చేసి వాళ్ల టైమ్ వేస్ట్ చేయొద్దని పేర్కొంది. తాను అభిమానించే వ్యక్తులకు.. కలిసి సినిమాలు చేయాలని ఉందని చెబుతూ సదరు వ్యక్తి ఫేక్ వాట్సాప్ ఖాతా నుంచి మెసేజులు పెడుతున్నాడని, ఇది తన దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చింది. దీనిపట్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
అదితీ తర్వాత ఇప్పుడు శ్రియ హెచ్చరిక
శ్రియ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. ఈ ఏడాది ‘మిరాయ్’లో తల్లిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘నాన్ వయలెన్స్’ అనే తమిళ మూవీ చేస్తోంది.
సైబర్ మోసాలపై సినీ తారల ఆందోళన
సినీ తారల పేరుతో జరుగుతున్న ఈ సైబర్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభిమానులు, ఇండస్ట్రీ సభ్యులు ఇలాంటి నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం పట్ల జాగ్రత్త వహించాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది.


