
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శ్రియ శరణ్ తన తాజా ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి, తల్లి అయిన తర్వాత కూడా ఆమె గ్లామర్ లో ఎలాంటి మార్పు లేదని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.
Key Points
శ్రియ శరణ్ గ్లామర్ లుక్స్ నెట్టింట వైరల్
పెళ్లి, పిల్లల తర్వాత కూడా అందంలో తగ్గేదే లేదు
నెటిజన్ల నుండి పొగడ్తలు, స్టన్నింగ్ కామెంట్స్
శ్రియ శరణ్ తాజా ఫోటోలు వైరల్
అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న’(Mallanna) సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి.
దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అంతే కాకుండా తన గ్లామర్‌తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు.
నెటిజన్ల నుంచి ప్రశంసలు
42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్‌కి అందం విషయంలో మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ అవుట్ ఫిట్‌లో అదరహో అనిపించింది. పెద్ద పెద్ద కళ్లతో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల‌్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గ్లామర్‌లో అదరగొడుతున్న శ్రియ
A post shared by World Beauties We Love (@worldbeautieswelove)
శ్రియ శరణ్ తన అందం, గ్లామర్ తో ఇప్పటికీ అభిమానులను మెప్పిస్తూనే ఉంది. మళ్ళీ తెలుగు తెరకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


