
ప్రముఖ నటి శృతి హాసన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి చేసుకోవడం లేదని, కానీ తల్లి కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. దత్తత ద్వారా పిల్లలను పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.
Key Points
శృతి హాసన్ పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించింది.
ఆమె తల్లి కావాలని కోరుకుంటోంది, దత్తత ద్వారా అయినా.
ప్రస్తుతం ఆమె రజనీకాంత్ సినిమాలో నటిస్తోంది.
శృతి హాసన్ పెళ్లిపై నిర్ణయం
పెళ్లంటేనే భయమేస్తోందంటోంది హీరోయిన్ శృతిహాసన్ ( Shruti Haasan ). వివాహ సాంప్రదాయాన్ని గౌరవిస్తానని, కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతానని చెప్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ.. పెళ్లి పేరు ఎత్తితేనే నాకు భయం వేస్తోంది. వివాహ పద్ధతిని నేను గౌరవిస్తాను. కానీ, నాకు మాత్రం అది అవసరం లేదనిపిస్తోంది. గతంలో ఒకసారి నేను రిలేషన్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేవరకు వెళ్లాను. కానీ పెళ్లి కాకుండానే ఆ ప్రేమ బంధం ముక్కలైంది.
దత్తత తీసుకుంటా పెళ్లంటే ఇద్దరు మనుషులు ఏకమవడమే కాదు. భవిష్యత్తును పంచుకోవడం, జీవితాంతం ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం.. ఇలా చాలా ఉంటాయి. పెళ్లంటే ఇష్టం లేదని నేను ఒంటరిగానే మిగిలిపోను. ఎప్పటికైనా తల్లి స్థానాన్ని పొందాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. భవిష్యత్తులో పిల్లల్ని దత్తత తీసుకుంటానేమో.. చెప్పలేం! అప్పుడు నేను సింగిల్ పేరెంట్‌గా మాత్రం వారిని పెంచను. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ కచ్చితంగా అవసరం.
తల్లి కావాలనే కోరిక
సింగిల్ అలా అని సింగిల్ పేరెంట్స్‌ను నేను తక్కువ చేయడం లేదు. వారిపై నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ప్రస్తుతానికైతే నేను నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ శృతి హాసన్ తను సింగిల్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది.. కాగా శృతి హాసన్ కొన్నేళ్లుగా ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమాయణం నడిపింది. గతేడాది వీరిద్దరూ విడిపోయారు. సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.
రజనీకాంత్ సినిమా
శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితం గురించి తెలిపిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తల్లి కావాలనే ఆమె కోరిక అభినందనీయం.


