|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బర్త్ డే వేళ షాకింగ్ అవతార్‌లో శృతి హాసన్! సిగరెట్‌తో దర్శనమిచ్చి దిమ్మతిరిగే ట్విస్ట్!

Published: 28-01-2026, 7:35 AM
బర్త్ డే వేళ షాకింగ్ అవతార్‌లో శృతి హాసన్! సిగరెట్‌తో దర్శనమిచ్చి దిమ్మతిరిగే ట్విస్ట్!
  • శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల.
  • పోస్టర్‌లో శృతిహాసన్ సిగరెట్ తాగుతూ షాకింగ్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం.
  • దుల్కర్ సల్మాన్, స్వాతిక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
  • శృతి హాసన్ చివరిగా ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో కనిపించారు.

శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో శృతి సిగరెట్ తాగుతూ కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆమె పాత్ర కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.

పుట్టినరోజు వేడుకలో శృతి హాసన్

Shruti Haasan: శృతిహాసన్ పరిచయం అవసరం లేని పేరు. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొని ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. ప్రస్తుతం హీరోయిన్ గా శృతిహాసన్ చాలా వరకు సినిమాలను తగ్గించారనే చెప్పాలి. హీరోయిన్గా కాకుండా స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే నేడు శృతిహాసన్ పుట్టినరోజు కావడంతో ఈమె నటిస్తున్న సినిమాల నుంచి ప్రత్యేకమైన పోస్టర్లను విడుదల చేస్తూ శృతిహాసన్(Shruti Haasan) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గీత ఆర్ట్స్ బ్యానర్ వారు “ఆకాశంలో ఒక తార” (Aakasam Lo Oka Tara )సినిమా నుంచి శృతిహాసన్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శృతిహాసన్ షాకింగ్ లుక్ లో కనిపించారని చెప్పాలి. నోటిలో సిగరెట్ పెట్టుకొని ఏదో చదువుతున్నట్టు ఈమె కనిపించడంతో ఒక్క సారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. నోటిలో సిగరెట్ తో కనిపించడంతో ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని స్పష్టమవుతుంది.

‘ఆకాశంలో ఒక తార’ నుండి ప్రత్యేక పోస్టర్

ఆకాశంలో ఒక తార సినిమాలో కూడా ఈమె భాగం కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ కి సంబంధించిన ఈ పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman), స్వాతిక వీరవల్లి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా లైట్ బాక్స్ మీడియా ఆధ్వర్యంలో స్వప్న సినిమాస్, గీత ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు , కన్నడ తమిళ మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా దుల్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఈ పోస్టర్ ద్వారా స్పష్టమవుతుంది. మరి ఈమె పాత్ర ఏంటనే విషయాలు తెలియాల్సి ఉంది. శృతిహాసన్ కూలీ సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ సినిమాలో ప్రభాస్ జోడిగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత శృతిహాసన్ హీరోయిన్ గా ఎలాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అతి త్వరలోనే సలార్ 2 పనులలో బిజీ కానున్నారు.

సిగరెట్ తాగుతూ షాకింగ్ లుక్

మొత్తానికి శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.