|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేవర 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. షూటింగ్ షురూ! కొరటాల శివ మాస్టర్ ప్లాన్!!

Published: 11-03-2026, 1:05 AM
దేవర 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. షూటింగ్ షురూ! కొరటాల శివ మాస్టర్ ప్లాన్!!
  • ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర 2 మేలో షూటింగ్ ప్రారంభం.
  • దేవర మొదటి భాగం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా 500 కోట్ల క్లబ్‌లో చేరింది.
  • పుష్ప 2 రేంజ్‌లో దేవర 2 ఉంటుందని కొరటాల శివ హామీ ఇచ్చారు.
  • ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర 2 సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. మొదటి భాగం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఈ సీక్వెల్ మాత్రం పుష్ప 2 రేంజ్‌లో ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు.

దేవర 2 షూటింగ్ ఎప్పుడు?

Devara 2 Shooting Update:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంత చేసుకున్న ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ (Prashanth neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో వేగంగా పాల్గొంటున్న ఆయన…మరొకవైపు దేవర 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత చేసిన చిత్రం ‘దేవర’ మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కాలక్రమేనా 500 కోట్ల క్లబ్లో చేరి.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ పై అప్పట్లోనే క్లారిటీ ఇచ్చినా.. చాలా మంది అభిమానులు పెదవి విరిచారు.

అసలే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రానికి మళ్లీ సీక్వెల్ అవసరమా అనే కామెంట్లు గుప్పించారు. కానీ కొరటాల శివ మాత్రం అంతకుమించి ఈ సినిమా ఉంటుంది.. పుష్ప 2 రేంజ్ లో దేవర 2 సినిమాను తెరకెక్కిస్తామని హామీ ఇచ్చారు.. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగుకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే గతంలో నిర్మాత చెప్పినట్లుగానే ఇప్పుడు షూటింగ్ అప్డేట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొరటాల శివ , ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర 2 సినిమా సీక్వెల్ మే నెల నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు అభిమానులు కూడా కొరటాల శివ హామీ ఇచ్చినట్టుగా అంతకుమించి ఏదైనా తీర్చిదిద్దుతారేమో అని చూస్తున్నారు. మరి మేలో సెట్ పైకి వెళ్ళబోయే ఈ సినిమా ఆ తర్వాత ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే ఇందులో అందాల తార జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తోంది.

మిక్స్‌డ్ టాక్ నుండి 500 కోట్ల క్లబ్ వరకు దేవర ప్రయాణం

పుష్ప 2 రేంజ్‌లో దేవర 2 ఉంటుందా?

ఇక ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను 2027లో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవల జోర్డాన్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అలా జోర్డాన్ లో షెడ్యూల్ పూర్తి చేసుకోగా ..అందులో ఎన్టీఆర్ , టోవినో థామస్ మధ్య కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం . ఇక హైదరాబాదు శివారులలో ఒక ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం మూడు పెద్ద సెట్స్ క్రియేట్ చేసి.. కొత్త షెడ్యూల్ ను ఈ వారం ఆఖరిలో ప్రారంభించబోతున్నారట. ఇక్కడ షూటింగ్ పూర్తి అయిన వెంటనే శ్రీలంక వెళ్ళనున్నట్లు సమాచారం.

దేవర 2 సినిమా మేలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.