
📌 Key Points
- అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా ‘ఫంకీ’ సినిమా తెరకెక్కుతోంది.
- ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘ఫంకీ’ క్రేజీ పోస్టర్ ఆకట్టుకుంది.
- నాగ వంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
విశ్వక్సేన్, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫంకీ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 13న ఈ క్రేజీ చిత్రం విడుదల కానుంది. చిత్రయూనిట్ విడుదల చేసిన పోస్టర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.
అనుదీప్ నుండి మరో విభిన్న చిత్రం
Funky Release Date : పిట్టగోడ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అనుదీప్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ పొందలేదు. మొత్తానికి జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఒక సినిమాతో డైరెక్టర్ కి అంత క్రేజ్ రావడం అనేది మామూలు విషయం కాదు. కేవలం సినిమాల పరంగా కాకుండా బయట అనుదీప్ మాట్లాడే విధానానికి, అలానే కొన్ని పంచెస్ వేయడం వలన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిపోయాడు.
శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ప్రిన్స్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా ఫంకీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్సేన్ డైరెక్టర్గా కనిపించనున్నాడు. రియల్ లైఫ్ లో కూడా విశ్వక్సేన్ డైరెక్టర్గా సక్సెస్ అయిపోయాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ఒక క్రేజీ పోస్టర్ తో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ముఖ్యంగా రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇన్నోసెంట్ లుక్ లో నవ్వుతూ కనిపించాడు విశ్వక్సేన్. విశ్వక్సేన్ వెనుక సినిమా రీల్ ఉండటం అనేది సినిమా కథను కొంతమేరకు చెబుతుంది.
అయితే దీనికి సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అనుదీప్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడు అని పలు సందర్భాలలో నిర్మాత నాగ వంశీ చెప్పాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఖరారు, పోస్టర్ విడుదల
Your ticket to a crazy, fun-filled experience with #FUNKY arriving on 13th FEB! 🕺
Fun for all. Madness for everyone. 100% Entertainment guaranteed. 😎
In cinemas #FunkyFrom13thFeb 🤘🏻
Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo … pic.twitter.com/kGHEGd2QkC
సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్
— Sithara Entertainments (@SitharaEnts) December 15, 2025
2025 అనేది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కి అంత బాగా కలిసి రాలేదు. ఇక అనుదీప్ సినిమాతో 2026 కలిసి వస్తుందేమో చూడాలి. మొత్తానికి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి 2026 లో విడుదలవుతున్న మొదటి సినిమా ఫంకీ.
‘ఫంకీ’ 2026లో సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. అనుదీప్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని నాగ వంశీ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ వినోదాత్మక చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


