
కోలీవుడ్ నటి శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రంలో పాడిన పాట గురించి మాట్లాడుతూ, అది జీవితకాల అనుభవమని పేర్కొంది. ఈ పాటకు అనూహ్యమైన స్పందన వచ్చిందని ఆమె తెలిపింది.
Key Points
శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ చిత్రం 'థగ్ లైఫ్' లో పాడిన పాటకు అద్భుతమైన స్పందన లభించింది.
ఈ పాట పాడటం జీవితకాల అనుభవమని శృతి వెల్లడించింది.
ఇంటివద్ద పియానా తో రిహార్సల్ చేయడం వల్ల రికార్డింగ్ సమయంలో ఒత్తిడి లేకుండా పాట పాడిందని శృతి తెలిపింది.
శృతి హాసన్ 'కూలీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
‘థగ్ లైఫ్’ పాటకు అద్భుతమైన స్పందన
కోలీవుడ్ స్టార్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan) మల్టీ టాలెంట్స్‌తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూను సింగర్‌గా కూడా రాణిస్తుంది. ప్రైవేట్ అల్బమ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ భామ తన టాలెంట్‌తో అందరినీ ఫిదా అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘కూలీ’(Coolie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా జీవితంలో చాలా కాలంగా నేను పాడుతూనే ఉన్నాను. ప్రజలు నా పాటలను ఇష్టపడ్డారు. కానీ దీనికి ఇంత స్పందన ఎప్పుడూ రాలేదు.
శృతి హాసన్ అనుభవాలను పంచుకుంది
నన్ను ఇష్టపడని వారు కూడా నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. నాన్న కమల్ హాసన్ థగ్‌లైఫ్ చిత్రంలో పాట పాడటం ఓ జీవితకాల అనుభవం. ఇలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తండ్రి మూవీలో పాట పాడే అదృష్టం ఎంతమంది కూతుళ్లకు దక్కుతుందో తెలియదు.. కానీ నిజంగా ఇదొక లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్. పాటను అద్భుతంగా పాడాను అని వందల మంది చెబుతున్నారు. అయితే ఇంటివల్ల పియానో ఈ పాట ట్రాక్‌ను రిహార్సల్ చేశాను. అందుకే రికార్డింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. నా కెరీర్‌లో మెమొరలబుల్ సాంగ్ ఇది’’ అని చెప్పుకొచ్చింది.
కమల్ హాసన్ చిత్రంలో పాట పాడటం గురించి
కాగా, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వచ్చిన మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో త్రిష, శింబు, జోజు జార్జ్(Joju George), నాజర్, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్యలక్ష్మి కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు జూన్ 5న థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే ఇందులోనే శృతి హాసన్ ఓ పాట పాడింది. ఇక ఈ సాంగ్‌కు ఊహించని విధంగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే.. శృతి తన అనుభవాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయింది.
శృతి హాసన్ తన తండ్రి చిత్రంలో పాడిన పాటకు లభించిన అనూహ్యమైన స్పందనతో ఆమె ఎంతో సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్ లో ఒక మరపురాని అనుభవం.


