|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జాతి రత్నాలు తర్వాత ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయావన్నారు.. సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ కామెంట్స్

Published: 30-08-2025, 2:50 AM
జాతి రత్నాలు తర్వాత ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయావన్నారు.. సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ కామెంట్స్

కుశ్ లవ్, తన్మయి హీరోహీరోయిన్లుగా నటించే ‘మయూఖం’ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ తన అనుభవాలను పంచుకున్నారు. ‘జాతి రత్నాలు’ తర్వాత తాను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేదనే విషయం కూడా ఆయన వెల్లడించారు.

Key Points

1

సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ 'మయూఖం' సినిమాలో పనిచేస్తున్నారు.

2

జాతి రత్నాలు తర్వాత ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణాలను సిద్ధం మనోహర్ వివరించారు.

4

సినిమా ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సిద్ధం మనోహర్ కామెంట్స్

కుశ్ లవ్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మయూఖం. ఈ సినిమాకు దర్శకుడు వెంకట్ బులెమోని దర్శకత్వం వహించారు. భారీ పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న మయూఖం సినిమాను సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీమతి శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా ఆగస్ట్ 29న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మయూఖం సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. అలాగే, అతిథులుగా వచ్చిన సినీ ప్రముఖులు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు.

డీవోపీ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ.. “వెంకట్ గారు నాకు చాలా కాలంగా పరిచయం. ఆయన ఒకరోజు పిలిచి జాతి రత్నాలు తర్వాత ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయావ్ అని అడిగారు. ఆ తర్వాత మయూఖం కథ వినిపించారు. కథ వినగానే సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం. మిగతావి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను” అని అన్నారు.

‘మయూఖం’ సినిమా ప్రారంభం

“ఆయన కథను చెప్పిన విధానం, చేసిన ప్రెజెంటేషన్ చూశాక ఇదొక గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఏర్పడింది. సినిమా కోసం ప్యాషనేట్‌గా కష్టపడే వెంకట్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమాకు పనిచేయడం కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా” అని సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ తెలిపారు.

అతిథిగా వచ్చిన లేడీ డైరెక్టర్ మంజుల మాట్లాడుతూ.. “మయూఖం అనే టైటిల్ చాలా బాగుంది. పోస్టర్‌తోనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఈ సినిమా వెంకట్ గారికి ఆయన టీమ్ అందరికీ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం. హీరో కుశ లవ్ ప్రతిభ కలవాడు. ఈ సినిమాతో అతనికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.

ప్రముఖుల అభిప్రాయాలు

నటుడు నటరాజ్ మాట్లాడుతూ.. “ఈ ఫ్రైడే మంచి ముహూర్తంలో మా సినిమా ప్రారభించుకున్నాం. మరో ఫ్రైడే రిలీజ్ డేట్‌తో మీ ముందుకు వస్తాం. ఈ చిత్రంతో ఎంతోమంది కొత్త వాళ్లకు మా డైరెక్టర్ వెంకట్, నిర్మాత శ్రీలత గారు అవకాశం కల్పిస్తున్నారు. మా కొత్త టాలెంట్‌ను మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా” అని చెప్పారు.

నటి సునీత మనోహర్ మాట్లాడుతూ.. “మయూఖం చిత్రంలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రంలో పార్ట్ కావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ వెంకట్ గారికి, ప్రొడ్యూసర్ శ్రీలత గారికి థ్యాంక్స్ చెబుతున్నా” అని పేర్కొన్నారు.

మొత్తంగా, ‘మయూఖం’ సినిమాపై సినీ ప్రముఖుల నుండి అంచనాలు పెరిగాయి. సిద్ధం మనోహర్ వంటి ప్రతిభావంతుల సహకారంతో ఈ సినిమా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.