
సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ‘3 BHK’ చిత్రం నుంచి రెండో పాట ‘ఆగిపోను నేను’ విడుదలైంది. ఈ పాట అమృత్ రామ్‌నాథ్ స్వరపరచగా, దేవ సాహిత్యం అందించి పాడారు. సిద్ధార్థ్ విభిన్న లుక్స్‌లో కనిపించడం విశేషం.
Key Points
సిద్ధార్థ్ నటించిన ‘3 BHK’ సినిమా నుంచి రెండో పాట విడుదల.
‘ఆగిపోను నేను’ అనే పాటను అమృత్ రామ్‌నాథ్ స్వరపరచగా, దేవ సాహిత్యం అందించారు.
సిద్ధార్థ్ విభిన్న లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
జూలై 4న ప్రపంచవ్యాప్తంగా ‘3 BHK’ గ్రాండ్ రిలీజ్.
‘3 BHK’ సినిమా నుంచి రెండో పాట విడుదల
సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. ఫస్ట్ సింగిల్ ‘కలలన్నీ’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ ‘ఆగిపోను నేను’ రిలీజ్ చేశారు మేకర్స్. అమృత్ రామ్‌నాథ్ సాంగ్‌ని ఎనర్జీటిక్‌గా కంపోజ్ చేయగా.. దేవ సాహిత్యం అందించడంతో పాటు అద్భుతంగా పాడారు. మూవీ థీంని ప్రజెంట్ చేసిన ఈ సాంగ్‌లో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్ అదిరిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీలో శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీఠా రఘునాథ్ , చైత్ర తదితరలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
‘ఆగిపోను నేను’ పాట విశేషాలు
జూలై 4న గ్రాండ్ రిలీజ్
సిద్ధార్థ్ కొత్త సినిమా ‘3 BHK’ పాటలతో, ప్రమోషన్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. జూలై 4వ తేదీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.


