|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Siddharth: కేవలం రూ.2 వేలకే మణిరత్నం దగ్గర జాయిన్ అయ్యా: హీరో సిద్ధార్థ్ (3BHK)

Published: 08-07-2025, 8:11 AM
Siddharth: కేవలం రూ.2 వేలకే మణిరత్నం దగ్గర జాయిన్ అయ్యా: హీరో సిద్ధార్థ్ (3BHK)

తాజాగా విడుదలైన ‘3BHK’ సినిమా విజయంతో సిద్ధార్థ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ ప్రయాణాన్ని, మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన విషయాన్ని వెల్లడించారు.

Key Points

1

సిద్ధార్థ్ కేవలం రూ.2000లకు మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా చేరారు.

2

3BHK సినిమా విజయవంతం అవ్వడంతో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.

4

సిద్ధార్థ్ తన తల్లిదండ్రుల ఆందోళనను, తన సినిమా ప్రయాణం గురించి వివరించారు.

సిద్ధార్థ్‌ కెరీర్ ప్రారంభం

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్‌కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ..’ నేను నా లైఫ్‌ను రెండుసార్లు రీసెట్ చేశాను. ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం రెండు వేల రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. అప్పుడు నా పేరేంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు.. అది కూడా డైరెక్టర్‌ అవుతానని అంటున్నాడు. వీడు ఏమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్‌గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా’ అని పంచుకున్నారు.

3BHK సినిమా విజయోత్సవం

మణిరత్నం తో సిద్ధార్థ్ అనుభవం

కాగా.. 3 బీహెచ్‌కే మూవీలో శరత్‌కుమార్‌, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముదుకొచ్చింది. కాగా.. గతేడాది సిద్ధార్థ్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఆదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. తెలంగాణలోని ఓ ప్రాచీన ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

సిద్ధార్థ్ తన కష్టపడి సాధించిన విజయం గురించి, తల్లిదండ్రుల ఆందోళనను గుర్తు చేసుకుంటూ తన ప్రయాణాన్ని వివరించారు. ఇది ప్రేరణాత్మకమైన కథ.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.