|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kriti Sanon: లార్డ్స్‌లో లవ్ బర్డ్స్.. బాయ్‌ఫ్రెండ్‌తో ఆదిపురుష్ భామ సందడి!

Published: 14-07-2025, 11:02 PM
Kriti Sanon: లార్డ్స్‌లో లవ్ బర్డ్స్.. బాయ్‌ఫ్రెండ్‌తో ఆదిపురుష్ భామ సందడి!

ఆదిపురుష్ సినిమాతో పాపులర్ అయిన కృతి సనన్, తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న కబీర్ బహియాతో లండన్‌లోని లార్డ్స్‌లో కనిపించింది. వారి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Key Points

1

ఆదిపురుష్‌లో నటించిన కృతి సనన్ లండన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించారు.

2

వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

4

ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోవాలని వీరిద్దరూ ప్లాన్ చేస్తున్నారని వార్తలు.

లార్డ్స్‌లో కృతి సనన్ సందడి

ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ . ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెప్పించింది . ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ప్రస్తుతం లండన్ ‌ లో వాలిపోయింది . ఇంగ్లాండ్ ‌ లో జరుగుతున్న టీమిండియా మ్యాచ్ ‌ లో తళుక్కున మెరిసింది . అయితే ఆమెతో పాటు బాయ్ ‌ ఫ్రెండ్ ‌ గా భావిస్తోన్న కబీర్ బహియా కూడా కనిపించారు . ఇద్దరు జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ‌ గా మారాయి . దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి .

కృతి – కబీర్ డేటింగ్ రూమర్స్

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కనిపించిన కృతి

అయితే ఈ జంట ఇలా కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు . అప్పట్లో వీరిద్దరు కలిసి వచ్చిన ఓ వీడియో నెట్టంట వైరలైంది . ఈ పెళ్లిలో కృతి సనన్ – కబీర్ చాలా సన్నిహితంగా కనిపించారు . లండన్ ‌ కు చెందిన వ్యాపారవేత్త అయినా కబీర్ ‌ తో కలిసి చాలాసార్లు విహారయాత్రల్లోనూ కృతి కనిపించింది . అయితే వీరిద్దరికీ దాదాపు ఎనిమిదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది . ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని .. ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ ‌ లో టాక్ వినిపిస్తోంది .

డేటింగ్ రూమర్స్ మళ్ళీ తెరపైకి

అయితే ఇదే మ్యాచ్ ‌ లో పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరై సందడి చేశారు . హీరో అక్షయ్ కుమార్ , ట్వింకిల్ ఖన్నా సైతం లార్డ్స్ టెస్ట్ ‌ మ్యాచ్ ‌ కు హాజరయ్యారు . భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి మ్యాచ్ ‌ ను వీక్షించారు .

లండన్‌లోని లార్డ్స్‌లో కనిపించిన కృతి సనన్ మరియు కబీర్ బహియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారి ప్రేమ వ్యవహారంపై మరిన్ని వార్తలు రావడానికి అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.