|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Siddhu Jonnalagadda : మైక్ ఉంది కదా అని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. ఆ లేడీ జర్నలిస్ట్ పై ఫైర్ అయిన సిద్దు జొన్నలగడ్డ..

Published: 14-10-2025, 8:11 AM
Siddhu Jonnalagadda : మైక్ ఉంది కదా అని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. ఆ లేడీ జర్నలిస్ట్ పై ఫైర్ అయిన సిద్దు జొన్నలగడ్డ..

ఇటీవల ఓ లేడీ జర్నలిస్ట్ అడిగిన అనుచిత ప్రశ్నకు హీరో సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి తీవ్రంగా స్పందించారు. మైక్ ఉందని అగౌరవంగా మాట్లాడటం సరికాదని, సినిమా పాత్రకు, వ్యక్తిగత జీవితానికి తేడా తెలుసుకోవాలని అన్నారు. ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

ఓ లేడీ జర్నలిస్ట్ అడిగిన అనుచిత ప్రశ్నకు సిద్ధూ జొన్నలగడ్డ ఫైర్.

2

"మైక్ ఉందని అగౌరవంగా మాట్లాడటం కరెక్ట్ కాదు" అన్న సిద్ధూ.

4

ఇలాంటి ప్రశ్నలకు అటెన్షన్ ఇవ్వనని, స్ట్రాంగ్ గా ఉంటానని స్పష్టీకరణ.

జర్నలిస్టుల తీరుపై సిద్ధూ ఆగ్రహం

Siddhu Jonnalagadda : ఇటీవల పలు జర్నలిస్టులు హద్దులు దాటి మారి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడుగుతున్నారు. రీసెంట్ గా తెలుసు కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సిద్ధూ జొన్నలగడ్డని ఓ లేడీ జర్నలిస్ట్ మీరు సినిమాలో బయట కూడా లాగా స్త్రీ లోలుడా(వుమనైజర్)? బయట కూడా ఇద్దరు అమ్మాయిలని ఒకేసారి లవ్ చేస్తారా అంటూ నెగిటివ్ గా ప్రశ్నించింది. దీంతో అది కాస్తా వైరల్ అయింది.(Siddhu Jonnalagadda)

నిన్నే ఆ లేడీ జర్నలిస్ట్ కి.. ఇది నా ఇంటర్వ్యూనా సినిమా ఇంటర్వ్యూనా అని కౌంటర్ ఇచ్చాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా నేడు మీడియాతో మాట్లాడుతూ మరోసారి దీని గురించి ప్రస్తావన రాగా సిద్ధూ దీనిపై స్పందిస్తూ ఫైర్ అయ్యాడు.

సినిమా, వ్యక్తిగత జీవితం మధ్య తేడా

సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అలా మాట్లాడటం అగౌరవం. మైక్ ఉంది కదా అని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకా అలా మాట్లాడి నవ్వుతున్నారు. అలాంటి దానికి ఇంక నేను ఏం సమాధానమిస్తాను. అందుకే అవాయిడ్ చేశాను. హీరో సినిమాలో పోలీస్ అయితే బయట కుడా పోలీస్ గా చేస్తారా. సినిమాకి బయటకి తేడా తెలీదా. మన చేతిలో మైక్ ఉందని, స్టేజిపై వాళ్ళు ఉన్నారని అలా అనడం కరెక్ట్ కాదు. అది వాళ్లకు వాళ్ళు రియలైజ్ అవ్వాలి.

అగౌరవ ప్రశ్నలు సరికాదు: సిద్ధూ

నిన్న నన్ను ఆ ప్రశ్న ఎవరు అడిగారో ఆమె ఎవరో కూడా నాకు తెలీదు. ఆమె ఈవెంట్ కి ముందు పద్దతిగా నన్ను ఇంటర్వ్యూ ఇమ్మని అడిగింది. ఇక్కడ మైక్ తీసుకోగానే మారిపోయింది. అది మంచి వాతావరణం కాదు, మంచిది కాదు. అయినా నన్ను అడగడం కాదు అలాంటి మాటలు అనేవాళ్లను అడగండి ఎందుకు అన్నారో. ఇలాంటివి నేను సీరియస్ గా తీసుకోను. అలాంటి వాటికి అటెన్షన్ ఇవ్వడం నచ్చదు. ఏదో ఒక రోజు వాళ్ళే తాము చేసింది తప్పు అని రియలైజ్ అవుతారు. సీనియర్ జర్నలిస్టులు మర్యాదగా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా ఉండటం కరెక్ట్ కాదు. నేను అందరితో బాగుండాలని అంటాను. వాళ్ళే ప్రదీప్ ని కూడా ఏదో అడిగారు, ఇష్యూ అయిందని చూశాను. అలాంటి వాటి మీద ఆలోచించడం కూడా వేస్ట్. ఇలాంటి ప్రశ్నల వల్ల నేను ఇబ్బంది పడను, ఫీల్ అవ్వను. స్ట్రాంగ్ గా ఉంటాను అని అన్నారు.

Also See : Suhana Khan : షారుఖ్ కూతురు.. చీరకట్టులో సుహానా ఖాన్ సొగసు చూడతరమా..

సిద్ధూ జొన్నలగడ్డ వ్యాఖ్యలు జర్నలిస్టుల తీరుపై చర్చను రేకెత్తించాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల పట్ల మర్యాద ఉండాలని, వృత్తి ధర్మాన్ని పాటించాలని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో కీలకమైన అంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.